Category
#తెలుగు సినిమా
సినిమా 

రాజా సాబ్ లీకులపై స్ట్రాంగ్ వార్నింగ్

రాజా సాబ్ లీకులపై స్ట్రాంగ్ వార్నింగ్ ప్రభాస్ హీరోగా, మారుతి డైరెక్షన్ లో వస్తున్న హారర్ కామెడీ థ్రిల్లర్ రాజాసాబ్ సినిమాపై అంచనాలు మళ్ళీ పెరుగుతున్న విషయం తెలిసిందే. మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్‌ లుగా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం ప్లాన్ ప్రకారం సినిమాను డిసెంబర్ లోనే విడుదల చేయాలని చూస్తున్నారు. అయితే...
Read More...
సినిమా 

ఓటీటీలోకి వ‌చ్చేసిన రానా నాయుడు 2.. 

ఓటీటీలోకి వ‌చ్చేసిన రానా నాయుడు 2..  విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ లో యాక్ట్ చేసిన లేటెస్ట్ వెబ్ సిరీస్ రానా నాయుడు. ఈ సిరీస్ సీజన్ 2 తాజాగా ఓటీటీలోకి వ‌చ్చేసింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, ఇంగ్లీష్ భాషల్లో నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. అమెరికన్ సిరీస్ రే డోనవన్‌కి రీమేక్‌గా వచ్చిన...
Read More...
సినిమా 

దుల్కర్ కోసం మరోసారి జీవి ప్రకాష్..

దుల్కర్ కోసం మరోసారి జీవి ప్రకాష్.. మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రజంట్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఆయన నటిస్తున్న సినిమాల్లో ఇప్పటికే కాంత, ఆకాశంలో ఒక తార అనే టైటిల్ తో తెలుగు ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ సినిమాలను పాన్ ఇండియా సినిమాలుగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక లేటెస్ట్ గ ఆయన...
Read More...
సినిమా 

త్రివిక్రమ్, బన్నీల సినిమా ఆగిపోవడానికి కారణం ఏంటంటే?

త్రివిక్రమ్, బన్నీల సినిమా ఆగిపోవడానికి కారణం ఏంటంటే? తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడిగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు స్పెషల్ ఇమేజ్ ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి ఆయన రీసెంట్ గా ఓ భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్టోరీతో మైథాలజీ జోనర్‌లో వస్తుందని అధికారికంగా ప్రకటించారు. అయితే ఊహించని విధంగా అల్లు...
Read More...
సినిమా 

హరిహర వీరమల్లు రిలీజ్ కు రెడీ.. ఆటంకాలు, గందరగోళం.. 

హరిహర వీరమల్లు రిలీజ్ కు రెడీ.. ఆటంకాలు, గందరగోళం..  హరిహర వీరమల్లు.. అసలు ఈ సినిమాకి పడినన్ని వాయిదాలు ఇక ఏ సినిమాకి లేవేమో అన్నట్లు పడ్డాయి. దీంతో ఫ్యాన్స్ ఓపికతో పాటు వేరే సినిమాల రిలీజ్ డేట్స్ ను కూడా గందరగోళంలో పడేసిన హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం జూలై 18 రిలీజ్...
Read More...
సినిమా 

కుబేరా బజ్ ఎలా ఉంది..? అంచనాలు..?

కుబేరా బజ్ ఎలా ఉంది..? అంచనాలు..? ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న భారీ ప్రాజెక్ట్ కుబేర. ఈ సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటి వరకు శేఖర్ కమ్ముల నుంచి ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమా వచ్చిందే లేదు. శేఖర్ కమ్ముల లాస్ట్ రెండు సినిమాలు ఫిదా, లవ్‌ స్టోరీ సినిమాలు కమర్షియల్‌ గా...
Read More...
ఆంధ్రప్రదేశ్  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

సినిమా హాళ్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

సినిమా హాళ్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అమరావతి: రాష్ట్రంలో సినిమా హాళ్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని... ఆ దిశగా సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. జనసేన కార్యాలయం నుండి విడుదల చేసిన లేఖలో కీలక సూచనలు చేశారు. కొత్త చిత్రాలు విడుదల సందర్భంలో టికెట్ ధరల పెంపు నిమిత్తం నిర్మాతలు, వారికి సంబంధించినవారు వ్యక్తిగత హోదాలో కాకుండా తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు - సినిమాలు హాళ్ల బంద్ ప్రకటనలు, ఈ క్రమంలో తమ శాఖ ద్వారా చేపట్టిన చర్యలను, తాజా పరిణామాలను ఉప ముఖ్యమంత్రివర్యులకు వివరించారు.   టికెట్ ధరల పెంపు కావచ్చు, సినిమా హాళ్ల నిర్వహణ విషయం కావచ్చు... ఏ విషయంలోనైనా ప్రభుత్వ శాఖలు తమ విధులను, పర్యవేక్షణను పకడ్బందీగా చేయాలన్నారు. త్వరలో విడుదలయ్యే హరిహర వీరమల్లు సినిమాకు సైతం టికెట్ ధరల పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వానికి అర్జీ ఇచ్చి, సంప్రదింపులు చేయాలని... ఇందులో తనమన బేధాలు పాటించవద్దు అని స్పష్టంగా చెప్పారు. టికెట్ ధర కంటే సినిమా హాల్లో తినుబండారాలు, తాగునీటి ధరలు. వాటి నాణ్యత పై సైతం సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ధరల నియంత్రణ కూడా చేపట్టాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్స్ లో ఆహార పదార్థాలు, శీతల పానీయాల వ్యాపారంలోను గుత్తాధిపత్యం సాగుతోందనే విషయం కూడా ప్రభుత్వ దృష్టికి వచ్చినందున దీనిపై విచారణ చేపట్టాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి సూచించారు. తెలుగు చిత్ర రంగంలో సినిమా హాళ్ల బంద్ ప్రకటనలు వెలువడటానికి గల కారణాలను పరిశీలించి....తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలికి, నిర్మాతల మండలికి, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, దర్శకుల సంఘాలకు తెలియచేయాలన్నారు. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకురాదలచిన కాంప్రహెన్సివ్ ఫిలిం డెవలప్మెంట్ పాలసీలో సినిమా రంగం అభివృద్ధికి సూచనలను కూడా తెలుగు సినిమా రంగంలోని సంఘాలు, మండళ్ల నుంచి స్వీకరించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు.
Read More...

Advertisement