మేడ్చల్ లో మరో దారుణ హత్య
By Ravi
On
మేడ్చల్ పట్టణంలో ఐదు రోజులు గడపకు ముందే మరో దారుణ హత్య జరిగింది. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న మోతిలాల్(45)ను తన మేనత్త కొడుకు అయిన శంకర్(35) సోమవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. ఆదివారం రాత్రి శంకర్ మద్యం తాగి వచ్చి తాము నివాసం ఉండే సరస్వతి నగర్ పక్కనే ఉన్న రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ మీద పడుకుని ఉండగా రైలు కింద పడి చనిపోతావని మోతిలాల్ హెచ్చరిస్తూ తన గృహానికి తెచ్చి విడిచి పెట్టాడు. ఈ విషయమై వారి మధ్య వాగ్వాదం జరిగింది. సోమవారం ఉదయం పని మీద బయటకు వచ్చిన మోతిలాలను తిడుతూ వెనుక నుంచి వచ్చి నడిరోడ్డు పైన పొడిచి చంపాడు. వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. ఘటన స్థలానికి చేరుకున్న సిఐ సత్యనారాయణ, పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Tags:
Latest News
19 May 2025 18:31:54
విధినిర్వహణలో రోడ్డుప్రమాదంలో మరణించిన హోం గార్డు అధికారికి రూ.6.28 లక్షల చెక్కును సైబరాబాద్ జాయింట్ సీపీ ట్రాఫిక్ డా. గజరావ్ భూపాల్ అందజేశారు. మియాపూర్ ట్రాఫిక్ పోలీస్...