ఒకేసారి మూడు తరాలు అగ్నికి ఆహుతి

By Ravi
On
ఒకేసారి మూడు తరాలు అగ్నికి ఆహుతి

ఒకేసారి మూడు తరాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. అప్పటి వరకు బంధువులతో కళకళ లాడిన ఆ ఇంట్లో హాహాకారాలు, ఆర్తనాదాలు, చివరకు రోధనలే మిగిలాయి. పాతబస్తీలో జరిగిన అగ్నిప్రమాదం AISelect_20250519_123541_Chromeగుల్జార్ హౌస్ ముత్యాల వ్యాపారి ప్రహ్లాద్ మోడీ కుటుంబాన్ని వెంటాడింది. 150 సంవత్సరాల క్రితం ముత్యాల వ్యాపారం చేసేందుకు హైదరాబాద్ వచ్చిన ప్రహ్లాద్ మోదీ తాత గుల్జార్ హౌజ్ చౌరస్తాలో భవనాన్ని కొనుగోలు చేసి ముత్యాల వ్యాపారంప్రారంభించాడు.  తాత నుండి ప్రహ్లాద్  తండ్రి పూనంచంద్ నుంచి వారసత్వంగా పొందిన వ్యాపారాన్ని సోదరులైన ప్రహ్లా ద్ మోదీ, రాజేంద్రకుమార్ మోదీలు వ్యాపారాన్ని కొనసాగిస్తూ విస్తరించారు. గుల్జార్ హౌజ్ చౌరస్తా సమీపంలోనే రెండంతస్తుల భవనంలోని కిందిభాగంలో వ్యాపారం, పైరెండు అంతస్తుల్లో కొడుకులు, మనుమలతో కలసి నివాసం ఉంటున్నారు. 
ప్రహ్లాద్ మోది కి నలుగురు సంతానం. ఇద్దరు కుమారుల్లో పెద్దకుమారుడు అత్తాపూర్లోని కొత్తగా నిర్మించిన ఇంట్లోకి ఇటీవలే మారాడు. ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లయ్యాయి. వారి కుటుంబాలు రాజీవ్ నగర్, సనత్ నగర్ లలో సిరపడ్డారు. చిన్నకొడుకు పంకజ్ మోది, భార్య ముగ్గురు పిల్లలతో తండ్రి వద్దనే నివాసం ఉంటూ వ్యాపారం చూసుకుంటున్నాడు. సెలవుల కావడంతో ఉత్తరాది నుంచి  బంధుమిత్రులతో ఇల్లంతా నిత్యం సందడిగా మారింది. పాతబస్తీ లో పుట్టి పెరిగిన ప్రహ్లాద్ మోదీకి ఓల్డ్ సిటీ అంటే ఎనలేని మమకారం. ఎంతో మంది బంధువులు వేరే ప్రాంతం వెళ్లాలని చెప్పిన ఆయన వినలేదు. ఇక్కడే పుట్టాను.. ఇక్కడే శ్వాస విడుస్తాను అంటూ సమాధానం ఇచ్చేవాడని బంధువులు తెలిపారు. ఆదివారం సంభవించిన అగ్నిప్రమాదంలో ప్రహ్లాద్ మోదీ దంపతులతో సహా కుమారుడు, ఇద్దరు కూతుళ్లు, మనుమలు, మనవరాళ్లు మృత్యుఒడికి చేరడంతో బంధుమిత్రులు తల్లడిల్లిపోతున్నారు. ఎప్పుడు కళకళలాడే ఆ ఇల్లు మసి బారిపోవడం, కాలిపోయిన ఆ మృతదేహాలను చూసిన స్థానికులు, బంధువులకు గుండెలు పగిలేంత పనైంది. ఒకేసారి మూడు తారలు మృత్యువాత పడటం మింగుడు పడని వ్యవహారం అయ్యింది. వారి ఆత్మకు శాంతి కలగాలని ఊరు, వాడ, బస్తి ఆ భగవంతుడిని ప్రార్ధన చేస్తోంది.

Tags:

Advertisement

Latest News

పేలుళ్లకు కుట్ర పన్నిన సమీర్ ఉండేది ఇక్కడే... పేలుళ్లకు కుట్ర పన్నిన సమీర్ ఉండేది ఇక్కడే...
హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటలీజెన్సీ జాయింట్ ఆపరేషన్ లో పోలీసులకు చిక్కిన సమీర్, సిరాజ్ కేసులో అధికారులు దర్యాప్తు ముమ్మరం...
రక్తం కారేలా కొట్టుకున్న intuc నేతలు
రైతుల పంటల సాగుపై అవగాహన
ఒకేసారి మూడు తరాలు అగ్నికి ఆహుతి
రూ. 300కోట్ల ప్రభుత్వ స్థలం కబ్జాకు యత్నం.. నిందితులపై నాన్ బెయిలబుల్ కేస్
మేడ్చల్ లో మరో దారుణ హత్య
కారు బీభత్సం.. బాలుడు మృతి.. బాలికకు గాయాలు