పేలుళ్లకు కుట్ర పన్నిన సమీర్ ఉండేది ఇక్కడే...

By Ravi
On
పేలుళ్లకు కుట్ర పన్నిన సమీర్ ఉండేది ఇక్కడే...

హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటలీజెన్సీ జాయింట్ ఆపరేషన్ లో పోలీసులకు చిక్కిన సమీర్, సిరాజ్ కేసులో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విజయనగరంకి చెందిన సిరాజ్ పేలుడు పదార్ధాలకు కావాల్సిన ముడి పదార్థాలు అక్కడ కొనుగోలు చేసి సికింద్రాబాద్ బోయిగూడా రైల్వే స్టేషన్ సమీపంలో వుండే సమీర్ కు అందించినట్లు తెలుస్తోంది. పెద్ద మొత్తంలో సేకరించిన ఈ వస్తువులు ఎవరెవరి దగ్గర కొనుగోలు చేశారు... ఎక్కడ దాచారు అనే కోణంలో విచారణ చేస్తున్నారు. సికింద్రాబాద్ ప్రాంతంతో పాటు సిటీలో ఏఏ ప్రాంతాల్లో డమ్మీ బ్లాస్ట్ లు ప్లాన్ చేశారు, రెక్కీ నిర్వహించిన ప్రాంతాల గురించి ఆధారాలు సేకరిస్తున్నారు. అందులో భాగంగా మరోసారి సమీర్ ఇంటి వద్ద కౌంటర్ ఇంటలీజెన్స్ పోలీసులు దర్యాప్తు చేశారు. ఐసిస్ తో గల సంబంధాలతో పాటు వీరికి డబ్బులు ఎలా అందించారు. సిటీలో ఎవరు సహకరించారు అని కూపీ లాగుతున్నారు. సమీర్ కుటుంబ సభ్యులను మరోసారి ప్రశ్నించారు. పేలుడు పదార్థాలు, వాటి రవాణా అనే అంశాలపై తమ అదుపులో ఉన్న వారి నుండి సమాచారం సేకరిస్తున్నారు.

Tags:

Advertisement

Latest News