రక్తం కారేలా కొట్టుకున్న intuc నేతలు
By Ravi
On
బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఐఎన్టీయుసీ నేతలు పరస్పర దాడులకు పాల్పడ్డారు. ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (INTUC) సంఘాల నాయకుల మధ్య గొడవ ఒక్కసారిగా బయటపడింది. ఐఎన్టీయూసీ సంజీవ రెడ్డి వర్గం, ఐఎన్టీయూసీ(ఆర్) అంబటి కృష్ణమూర్తి వర్గాల మధ్య గొడవ తీవ్ర స్థాయికి చేరుకుంది. ప్రెస్ క్లబ్ లో ఐఎన్టీయూసీ(ఆర్) నేషనల్ ప్రెసిడెంట్ అంబటి కృష్ణమూర్తి ప్రెస్ మీట్ ను సంజీవరెడ్డి అనుచరుడు చంద్రశేఖర్ అడ్డుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆయనపై చేయి చేసుకోవడంతో గొడవ పెద్దదైంది. ఒకరిపై నొకరు దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న అబిడ్స్ పోలీసులు ప్రెస్ క్లబ్ వద్దకు చేరుకొని సంజీవరెడ్డి వర్గీయులను అదుపులోకి తీసుకున్నారు.
Tags:
Latest News
19 May 2025 18:31:54
విధినిర్వహణలో రోడ్డుప్రమాదంలో మరణించిన హోం గార్డు అధికారికి రూ.6.28 లక్షల చెక్కును సైబరాబాద్ జాయింట్ సీపీ ట్రాఫిక్ డా. గజరావ్ భూపాల్ అందజేశారు. మియాపూర్ ట్రాఫిక్ పోలీస్...