మేడ్చల్ లో మరో దారుణ హత్య

By Ravi
On
మేడ్చల్ లో మరో దారుణ హత్య

మేడ్చల్ పట్టణంలో ఐదు రోజులు గడపకు ముందే  మరో దారుణ హత్య జరిగింది. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న  మోతిలాల్(45)ను తన మేనత్త కొడుకు అయిన శంకర్(35) సోమవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. ఆదివారం రాత్రి శంకర్ మద్యం తాగి వచ్చి తాము నివాసం ఉండే  సరస్వతి నగర్ పక్కనే ఉన్న రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ మీద పడుకుని ఉండగా రైలు కింద పడి చనిపోతావని మోతిలాల్ హెచ్చరిస్తూ తన గృహానికి తెచ్చి విడిచి పెట్టాడు. ఈ విషయమై వారి మధ్య వాగ్వాదం జరిగింది. సోమవారం ఉదయం పని మీద బయటకు వచ్చిన మోతిలాలను  తిడుతూ వెనుక నుంచి వచ్చి నడిరోడ్డు పైన పొడిచి చంపాడు. వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. ఘటన స్థలానికి చేరుకున్న సిఐ సత్యనారాయణ, పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Tags:

Advertisement

Latest News

రక్తం కారేలా కొట్టుకున్న intuc నేతలు రక్తం కారేలా కొట్టుకున్న intuc నేతలు
బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఐఎన్టీయుసీ నేతలు పరస్పర దాడులకు పాల్పడ్డారు.  ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (INTUC) సంఘాల నాయకుల మధ్య గొడవ...
రైతుల పంటల సాగుపై అవగాహన
ఒకేసారి మూడు తరాలు అగ్నికి ఆహుతి
రూ. 300కోట్ల ప్రభుత్వ స్థలం కబ్జాకు యత్నం.. నిందితులపై నాన్ బెయిలబుల్ కేస్
మేడ్చల్ లో మరో దారుణ హత్య
కారు బీభత్సం.. బాలుడు మృతి.. బాలికకు గాయాలు
హైదర్ నగర్ లో విరుచుకుపడ్డ హైడ్రా.. షెడ్ల తొలగింపు