రాష్ట్ర  వ్యాప్తంగా  దావత్   ఏ ఇఫ్తార్ ఘనంగా నిర్వహించండి ....

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు 

By Ravi
On
రాష్ట్ర  వ్యాప్తంగా  దావత్   ఏ ఇఫ్తార్ ఘనంగా నిర్వహించండి ....

హైదరాబాద్, మార్చి 22 :: దావత్ ఏ ఇఫ్తార్ ను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. శనివారం అసెంబ్లీ సమావేశ మందిరంలో ఇఫ్తార్ విందు, రంజాన్ పండుగ ఏర్పాట్లను ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి సమీక్షించారు. 

ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహించే ఈ కార్యక్రమాలకు ఎలాంటి నిధుల కొరత లేదు అని డిప్యూటీ సీఎం తెలిపారు. ఆహారంలో నాణ్యత, ప్రోటోకాల్, సౌకర్యాల కల్పనలో అధికారులు ఎలాంటి రాజీ పడాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం తెలిపారు. ఏర్పాట్లలో అధికారులు ఏమాత్రం అశ్రద్ధ వహించరాదని, చిన్న పొరపాటుకు అవకాశం లేకుండా చూడాలని డిప్యూటీ సీఎం తెలిపారు. లా అండ్ ఆర్డర్, ఎలక్ట్రిసిటీ, మంచినీరు వాటి అంశాలు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కోరారు. ఏర్పాట్లలో ఎలాంటి అనుమానాలు, ఇబ్బందులు ఎదురైనా అధికారులు మొహమాట పడకుండా జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ లేదా తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. ఏర్పాట్లకి సంబంధించి రోజువారి సమీక్షను ప్రభుత్వ సలహాదారు, ఏర్పాట్ల కమిటీ వైస్ చైర్మన్ షబ్బీర్ అలీ రోజువారి సమీక్ష చేస్తారని తెలిపారు.

సమావేశంలో మంత్రి పొన్నం  ప్రభాకర్ మాట్లాడుతూ రంజాన్ పవిత్ర మాసంలో  ముస్లిం సోదరులకు ఏలాంటి అసౌకర్యం లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, దావత్ ఏ ఇఫ్తార్ కు కూడా ఘనంగా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ మా ప్రభుత్వం 
దావత్ ఏ ఇఫ్తార్ ను ఘనంగా నిర్వహిస్తుందని అన్నారు.
సమావేశంలో అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

బెట్టింగ్ రాయుళ్లు అరెస్ట్..! బెట్టింగ్ రాయుళ్లు అరెస్ట్..!
హైదరాబాద్ నగరంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారి ఆట కట్టించారు.సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్, మంగళ్ హాట్ పోలీసులు. ఈ ఇద్దరు కలిసి సంయుక్తంగా దాడులు జరిపారు....
కన్నుల పండుగగా పల్లకీ శోభాయాత్ర..!
కన్నుల పండుగగా జుంటుపల్లి సీతారాముల కల్యాణం..!
బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య చీకటి ఒప్పందం : పొన్నం ప్రభాకర్‌
అయోధ్య తరహాలో బాలరాముడి శోభాయాత్ర..!
బాబు జగ్జీవన్ రామ్ కు ఘన నివాళి..!
ఘంటసాల కుమారుడు కన్నుమూత..!