జగదీశ్ రెడ్డి మాజీ మంత్రి, ఎమ్మెల్యే చిట్ చాట్
అసెంబ్లీ పై ఆగ్రహం, సస్పెన్షన్ బులెటిన్ గురించి క్లారిఫికేషన్
హైదరాబాద్, మార్చి 23:
పొన్నూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అసెంబ్లీ కార్యాచరణపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెండ్ అయినప్పటి నుంచి తనకు బులెటిన్ ఇవ్వకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
"ఇప్పటివరకు సస్పెండ్ పై బులెటిన్ ఇవ్వలేదు. బులెటిన్ ఇస్తే నేను రాను, ఏ కారణంతో నన్ను సస్పెండ్ చేసారు?" అని ప్రశ్నించారు. జవాబులు ఇవ్వకుండా అసెంబ్లీ నడుపుతున్నారని, రాజ్యాంగ విలువలు, నిబంధనలకు అనుగుణంగా అసెంబ్లీ నడవడం లేదని ఆరోపించారు.
"వారం రోజుల నుంచి బులెటిన్ అడుగుతున్నా, ఇంకా ఇవ్వలేదు. సస్పెండ్ అయిన వెంటనే బులెటిన్ ఇవ్వాలి. ఆధారాలు లేకపోయినా సస్పెండ్ చేసి, బులెటిన్ ఇవ్వడం లేదు," అని ఆయన తెలిపారు.
అలాగే, "హెలికాప్టర్‌లలో తిరుగుతున్నారు మా నల్గొండ జిల్లా మంత్రులు. గంట ప్రయాణం కోసం కూడా హెలికాప్టర్ ఉపయోగిస్తున్నారు" అని విమర్శించారు.
"ప్రశ్నలకు సమాధానాలు లేక, క్వశ్చన్ అవర్‌ను రద్దు చేస్తున్నారు. ప్రజల సమస్యలు, శాసనసభలో లేవనెత్తిన ప్రశ్నలకు జవాబులేదు" అంటూ అధికారిక చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
పవర్ ప్లాంట్ ప్రమాదంపై కూడా ఆయన తన స్పందనను వివరించారు. "ప్రతి శవం దగ్గరకు నేను వెళ్లాను, సహాయక చర్యల్లో పాల్గొన్నాను. చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సాయం ఇచ్చాను," అని పేర్కొన్నారు.
ఇక, తన సస్పెన్షన్ వివరాలు ఇంకా స్పష్టంగా వెల్లడించని అధికారులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
జగదీశ్ రెడ్డి అసెంబ్లీ వ్యవహారంపై, ప్రభుత్వ చర్యలపై స్పష్టమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.