విజయవాడలో జాక్‌ సినిమా టీమ్‌ సందడి..!

By Ravi
On
విజయవాడలో జాక్‌ సినిమా టీమ్‌ సందడి..!

జాక్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హీరో జొన్నలగడ్డ సిద్దు, హీరోయిన్ వైష్ణవి చైతన్య, నిర్మాత బీవీఎస్ఎన్‌ ప్రసాద్ విజయవాడ నగరంలో సందడి చేశారు. బందర్ రోడ్డులోని గేట్‌వే హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హీరో సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. విజయవాడ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. జాక్ మూవీ స్టోరీ విన్నప్పుడు చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అయ్యాననీ .. హీరోయిన్‌తో ఈ మూవీలో కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయిందన్నారు. కామెడీ లవ్ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయనీ.. ఇంటర్వెల్ సన్నివేశాలు ఉత్కంఠకు గురిచేస్తాయన్నారు. హీరోయిన్ వైష్ణవి చైతన్య వేసే పంచులు ఈ మూవీలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయనీ చెప్పారు. టిల్లు క్యూబ్, తెలుసు కదాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నామని అన్నారు. ఈ చిత్రానికి ముగ్గురు సంగీత దర్శకులు పనిచేశారనీ.. ఒక్కొక్క పాట చాలా డిఫరెంట్‌గా ఉంటుందన్నారు. హీరోయిన్ వైష్ణవి చైతన్య మాట్లాడుతూ... హీరో సిద్దు జొన్నలగడ్డతో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. జాక్ స్టోరీ చాలా డిఫరెంట్‌గా ఉంటుందనీ.. బేబీ మూవీకి జాక్ మూవీకి సంబంధం లేదన్నారు. రెండు డిఫరెంట్ జోనర్లని.. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేయాలని కోరారు. అనంతరం నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ చిత్రం కచ్చితంగా 1000 కోట్లు కలెక్షన్స్ అందుకోబోతుందన్నారు. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా నిర్మించారనీ.. ఆయన చెప్పిన కథ నచ్చిన వెంటనే చిత్రం తీయడానికి ముందుకు వచ్చానని చెప్పారు. పవన్ కళ్యాణ్ డేట్ ఇస్తే కచ్చితంగా ఆయనతో కూడా చిత్రాన్ని తీస్తామన్నారు.

Tags:

Advertisement

Latest News