బీటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి..?
By Ravi
On
కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నక్కవానిదారి గ్రామానికి చెందిన లక్ష్మీ వర్ధన్ (22) అనుమానాస్పదంగా మృతిచెందాడు. మార్చి 2వ తేదీన అర్ధరాత్రి 11.30 నిమిషాలకు ఫోన్ వచ్చిందని ఇంటి నుంచి బయటకు వెళ్లిన లక్ష్మీవర్ధన్.. మళ్లీ తిరిగిరాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో 3వ తారీకు సాయంత్రం కోడూరు పోలీస్ స్టేషన్‌లో లక్ష్మీ వర్ధన్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఐతే.. పాత ఉపకాలి మడ అడవుల మధ్యలో చెట్టుకి ఉరి వేసుకుని మృతదేహం ఉన్నట్లు సమాచారం రావడంతో.. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ మృతదేహాన్ని లక్ష్మీవర్ధన్‌గా గుర్తించారు. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లక్ష్మీ వర్ధన్ కంచికచర్ల నిక్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.
Tags:
Latest News
05 Apr 2025 19:46:00
డా. బాబు జగ్జీవన్ రామ్‌కు శ్రద్ధాంజలి ఘటించిన అదనపు డిజిపి మహేష్ ఎం. భగవత్ ఐపీఎస్
మాజీ ఉప ప్రధాని డా. బాబు జగ్జీవన్ రామ్ జన్మదినాన్ని...