తాండూరులో ఘనంగా ఇఫ్తార్ విందు - ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొనడం

By Ravi
On
తాండూరులో ఘనంగా ఇఫ్తార్ విందు - ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొనడం

 

తాండూరు, వికారాబాద్ జిల్లా:

తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని క్లాసిక్ గార్డెన్‌లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, నాయకులు మరియు ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ మరియు ఇతర నాయకులు ముస్లిం పెద్దలకు పండ్లు తినిపించి, వారి సంస్కృతీ, ఆత్మీయతను పంచుకున్నారు. అనంతరం, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు మరియు పండగ సమయంలో మతసామస్యతను తొలగిస్తూ, శాంతి మరియు ఐక్యత యొక్క సందేశం ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుమారుడు అవినాష్ రెడ్డి, తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు ఉత్తమ్ చంద్, మైనార్టీ నాయకులు అబ్దుల్ హాది, మసూద్, మాజీ వైస్ చైర్మన్ సాజిద్ అలీ, పలువురు ముస్లిం పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, రంజాన్ మాసం ఆత్మీయతను పెంచి, మతసామస్యతను తొలగించడంలో సహాయపడుతుందని, ఈ పవిత్ర మాసం అనంతరం ముస్లిం సోదరులు పండగను ప్రశాంతంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Tags:

Advertisement

Latest News

తప్పుడు ఆరోపణలతో వేధిస్తున్నారు.. జీహెచ్ఎమ్‌సీ టౌన్‌ ప్లానింగ్ ఎంప్లాయిస్ ఆవేదన..! తప్పుడు ఆరోపణలతో వేధిస్తున్నారు.. జీహెచ్ఎమ్‌సీ టౌన్‌ ప్లానింగ్ ఎంప్లాయిస్ ఆవేదన..!
జీహెచ్ఎమ్‌సీ టౌన్‌ ప్లానింగ్‌లోని కిందిస్థాయి దళిత ఉద్యోగ సిబ్బందిని.. తప్పుడు ఆరోపణలతో వేధిస్తున్నారని ఆరోపిస్తూ భాగ్యనగర్ జీహెచ్ఎమ్‌సీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఉన్నతాధికారులకు వినతిపత్రాలను అందజేశారు. ప్రభుత్వ...
ప్రభాకర్‌రావు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్..!
ఏఐ వీడియోస్‌పై హైకోర్టులో రేవంత్‌ సర్కార్‌ పిటిషన్..!
అనుకృష్ణ ఆస్పత్రికి రూ. 5లక్షల జరిమానా.. లైసెన్స్ రద్దు..!
ఘనంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం జన్మదిన వేడుకలు..!
అక్రమంగా బాడీ బిల్డింగ్‌ స్టెరాయిడ్స్‌ విక్రయాలు