రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచనలు

By Ravi
On
రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచనలు

WhatsApp Image 2025-03-24 at 2.29.30 PMనల్గొండ జిల్లా, తిప్పర్తి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై సూచనలు చేశారు. ఆయన రైతులకు వరి కాకుండా సన్నధాన్యాన్ని ఎక్కువగా పండించాలని కోరారు.

ఈ ఉగాది నుండి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు చౌకధర దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. హుజూర్నగర్ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మంత్రి, వచ్చే సంవత్సరం సన్నధాన్యాన్ని అధిక మొత్తంలో పండించాలని రైతులకు సూచించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత సంవత్సరం తిప్పర్తి పిఎసిఎస్ ద్వారా సుమారు 75,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు తెలిపారు. రైతులకు 2320 రూపాయల మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు.

సకాలంలో సాగునీటి విస్తీర్ణం పెరిగిందని, కాలువలు మరమ్మతు చేయడం, నాగార్జునసాగర్, ఉదయ సముద్రం ద్వారా రెండు పంటలకు నీరు విడుదల చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల లోపు రుణమాఫీ చేసినట్టు మంత్రి వెల్లడించారు.

కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, రైతులకు ధాన్యాన్ని శుభ్రం చేసి, ఆరబెట్టిన తర్వాత కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News