అయోధ్య తరహాలో బాలరాముడి శోభాయాత్ర..!

By Ravi
On
అయోధ్య తరహాలో బాలరాముడి శోభాయాత్ర..!

హైదరాబాద్‌లో శ్రీరామనవమి భవ్య పల్లకి శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. ఈ ఏడాది అయోధ్య తరహాలో బంగారు ఆభరణాలతో అలంకరించిన బాలరాముని విగ్రహంతోపాటు ఛత్రపతి శంభాజీ మహారాజ్ విగ్రహం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని శోభాయాత్ర అధ్యక్షులు ఆనంద్ సింగ్ తెలిపారు. అయోధ్య నుంచి స్వయంగా రాముడు నగరానికి వచ్చినట్టు ఈ ప్రతిమ రూపుదిద్దుకుందని వివరించారు. ధూల్‌పేట్‌ నుంచి సుల్తాన్ బజార్ వరకు ఈ యాత్ర సాగే ప్రాంతాల్లో పోలీసులు వాహనాల రాకపోకలు నిషేధించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు. 2000 మంది పోలీసులతో అడుగడుగునా సీసీ కెమెరాలతో బందోబస్తు పటిష్టం చేశారు. అల్లరిమూకలకు చెక్ పెట్టేందుకు షాడో టీమ్స్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా అనేక స్వచ్ఛంద సంస్థలు అడుగడుగునా శోభయాత్రకు స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. యాత్రలో పాల్గొనే భక్తుల కోసం పులిహోర, మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేశారు.

Tags:

Advertisement

Latest News

కీలక ప్రాజెక్టు నుంచి రవితేజ తప్పుకున్నారా? కీలక ప్రాజెక్టు నుంచి రవితేజ తప్పుకున్నారా?
సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లో లేకుండా వచ్చి తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఫస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వచ్చినా.....
పాతబస్తీలో భజరంగ్‌దళ్ భారీ బైక్ ర్యాలీ
ఫన్ సీన్స్ షెడ్యూల్ లో బిజీగా జైలర్ 2
విశ్వంభర నుంచి ఫస్ట్ సాంగ్ అవుట్
మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్ రిలీజ్ డేట్?
27 కిలోమీటర్ల మేర హనుమాన్‌ శోభాయాత్ర
ఎమ్మెల్సీ విజయశాంతికి బెదిరింపులు..!