బాబు జగ్జీవన్ రామ్ కు ఘన నివాళి..!
డా. బాబు జగ్జీవన్ రామ్‌కు శ్రద్ధాంజలి ఘటించిన అదనపు డిజిపి మహేష్ ఎం. భగవత్ ఐపీఎస్
మాజీ ఉప ప్రధాని డా. బాబు జగ్జీవన్ రామ్ జన్మదినాన్ని పురస్కరించుకుని, శనివారం 2025 ఏప్రిల్ 5న లా అండ్ ఆర్డర్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహేష్ ఎం. భగవత్ ఐపీఎస్, డీజీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పుష్పగుచ్ఛం సమర్పించి శ్రద్ధాంజలి అర్పించారు.
ఈ సందర్భంగా మహేష్ ఎం. భగవత్ మాట్లాడుతూ, డా. బాబు జగ్జీవన్ రామ్ ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు మాత్రమే కాకుండా, వెనుకబడిన తరగతుల నుంచి ఎదిగి పార్లమెంట్‌లో అనేక కీలక పదవుల్లో దేశానికి సేవలందించిన అటుటాటి సామాజిక సంస్కర్త అని చెప్పారు. ఉపప్రధాని మరియు రక్షణ మంత్రిగా ఆయన చేసిన సేవలు దేశ నిర్మాణం పట్ల ఆయన నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు.
అటువంటి దూరదృష్టి గల నాయకుల ఆలోచనలు, ఆశయాలు ప్రజల మనసుల్లో నేటికీ నిలిచి ఉన్నాయని మహేష్ భగవత్ తెలిపారు. ముఖ్యంగా యువత డా. బాబు జగ్జీవన్ రామ్ జీవితానికి ప్రేరణగా తీసుకొని, సామాజిక న్యాయం, సమానత్వం, దేశసేవ వంటి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో డీజీపీ కార్యాలయ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.