పిఠాపురంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ..! 

By Ravi
On
పిఠాపురంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ..! 

పిఠాపురం నియోజకవర్గం పరిధిలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం కోసం దరఖాస్తు చేసుకున్న పలువురికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ చొరవతో నిధులు మంజూరయ్యాయి. మొత్తం 45 మందికి రూ. 40 లక్షలకుపైగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరు కాగా.. పిఠాపురం పర్యటనలో భాగంగా చేబ్రోలులోని పవన్ కళ్యాణ్‌ నివాసంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నాగబాబు లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. సాయం కోసం దరఖాస్తులు వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని త్వరితగతిన సాయం అందే ఏర్పాటు చేసినట్టు ఈ సందర్భంగా తెలిపారు.

Tags:

Advertisement

Latest News