కల్వ సుజాతపై డీఎస్పీకి ఫిర్యాదు..

By Ravi
On
కల్వ సుజాతపై డీఎస్పీకి ఫిర్యాదు..

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్ పర్సన్, తాండూరుకు చెందిన కల్వ సుజాతపై స్థానిక బీజేపీ నేతలు తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డికి ఫిర్యాదును అందజేశారు. ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్ పర్సన్ హోదాలో ఉన్న కల్వ సుజాత ఫేస్ బుక్‌లో తన ఖాతా నుంచి దేశ ప్రధాని నరేంద్ర మోదిపై ఆయనను అగౌరవ పరిచేలా వీడియోను పోస్ట్ చేశారని ఆరోపించారు. దేశ ప్రధానిపై మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్దేశ్యపూర్వకంగా చేసిన పోస్టును ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశ ప్రధానిని, దేశ పౌరుల మనోభావాలకు భంగం కలిగించే రీతిలో ఉన్న పోస్టును తొలగించాలని కోరారు. ప్రధానిపై ఫేక్ పోస్టు చేసిన కల్వ సుజాతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Tags:

Advertisement

Latest News

నన్ను వేశ్యలాగా చూశారు..వివాదాస్పదమైన మిస్ వరల్డ్ పోటీలు నన్ను వేశ్యలాగా చూశారు..వివాదాస్పదమైన మిస్ వరల్డ్ పోటీలు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలు అపవాదును మూటగట్టుకుంది. ఈ పోటీల్లో ఖండాల వారీగా 24 మంది విజేతలను ఎంపిక చేశారు. వారిలో...
కల్వ సుజాతపై డీఎస్పీకి ఫిర్యాదు..
టాలీవుడ్‌ ఫోర్‌ పిల్లర్స్‌కు పవన్‌ రిటర్న్‌ గిఫ్ట్‌..!
అధిక పెన్షన్‌ పై అయోమయం.. పోరాటానికి సిద్ధమైన సంఘం
గ్రామ పాలన అధికారి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి - సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్
కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ..