నకిలీ పత్రాలతో భవన నిర్మాణం.. సీజ్ చేసిన అధికారులు
కొండాపూర్ పరిధిలోని రాజరాజేశ్వరి నగర్ కాలనీలో ప్లాట్ నెంబర్ 147లో 300గజాల ప్లాట్ కు సంబందించి నకిలీ పత్రాలు సృష్టించి బిల్డర్ నిర్మాణాలు చేపట్టాడు. ఒరిజినల్ ఓనర్ అయినటువంటి నానీశెట్టి ప్రమీల చనిపోవడంతో ఆమె లేదని తెలుసుకున్న సదరు బిల్డర్ అదే అదునుగా భావించి ఆమె సంతకాలు ఫోర్జరీ చేసి మున్సిపల్ పర్మిషన్ లేకుండా గ్రౌండ్ ప్లస్ 6 అంతస్తుల భవనాన్ని నిర్మించాడు. ఇదే విషయం పై ఆమె వారసురాలు సదరు బిల్డర్ ను ప్రశ్నించగా ఎదురు తిరగడంతో కోర్టును ఆశ్రయించారు. ప్లాట్ నెంబర్ 147లో ఎటువంటి నిర్మాణం చేపట్టకూడదని కూకట్పల్లి కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ తిరిగి నిర్మాణం చేపడుతుండటంతో బాధితురాలు హైకోర్టుకు వెళ్లడంతో నిర్మాణాన్ని వెంటనే ఆపాల్సిందిగా మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి. స్థానిక జీఎచ్ఎంసి అధికారులు మరియు గచ్చిబౌలి పోలీసులు కలిసి నిర్మాణానన్ని సీజ్ చేసారు. కోర్టు ఉత్తర్వులు వున్నందున ఎటువంటి నిర్మాణపనులు చేపట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని గచ్చిబౌలి సీఐ హాబిబుల్లా హెచ్చరించారు.