లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ..
లంచం తీసుకుంటూ ఓ ఎస్ఐ ఏసీబీకి చిక్కిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషనులో చోటు చేసుకుంది. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బల్కంపేటకి చెందిన హరి కమల్ బ్యాండ్ సిబ్బంది జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ శుభకార్యకానికి హాజరై బ్యాండ్ వాయించారు. కాగా శబ్ద కాలుష్యానికి పాలపడుతున్నారని ఆ బ్యాండ్ కు చెందిన వాహనాన్ని సామాగ్రిని ఎస్ ఐ శంకర్ సీజ్ చేసాడు.. ఆవాహనాన్ని సామాగ్రిని హరికమల్ బ్యాండ్ సిబ్బందికి తిరిగి ఇచ్చేందుకు 15 వేల రూపాయలు డిమాండ్ చేశాడు. ఆ మొత్తాన్ని జగద్గిరిగుట్టకు చెందిన నాగేందర్ ను మధ్యవర్తిగా పెట్టుకొని, ఆ మొత్తాన్ని తనకు ఇవ్వాలని బాధితులను కోరాడు. ఎస్ ఐ వేధింపులు తాళలేక, బాధితుడు ఏసీబీ కి ఫిర్యాదు చేయగా, డిమాండ్ మేరకు శనివారం బాధితుడు 15 వేల రూపాయల నగదును మధ్యవర్తి నాగేందర్ కు అందజేశారు. అతడు ఆ మొత్తాన్ని ఎస్ ఐ కు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు వలపన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అవినీతికి పాల్పడిన ఎస్ ఐ శంకర్, అతనికి సహకరించిన నాగేందర్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.