నిధుల కేటాయింపుకై కమిషనర్ కి ఎమ్మెల్యే వినతి

By Ravi
On
నిధుల కేటాయింపుకై కమిషనర్ కి ఎమ్మెల్యే వినతి

 పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా రామచంద్రాపురం,భారతీ నగర్, పటాన్‌చెరు డివిజన్లలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు కేటాయించాలని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) కమిషనర్ ఆర్.వి. కర్ణన్‌ను కోరారు.మంగళవారం హైదరాబాద్‌లోని జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో కమిషనర్‌తో ఎమ్మెల్యే జిఎంఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మూడు డివిజన్ల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని, నిధుల కొరతను కమిషనర్‌కు వివరించారు. ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన కాలనీల్లో రోడ్లు, మురుగునీటి కాలువలు, పార్కుల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు తక్షణమే నిధులు విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నిధుల కొరత కారణంగా పలు కాలనీల్లో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే జిఎంఆర్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కమిషనర్ కర్ణన్, త్వరలోనే నిధుల మంజూరుకు ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ పరిణామం ఆయా డివిజన్ల ప్రజలకు ఊరటనిచ్చే అంశంగా పరిగణించవచ్చు. త్వరలోనే నిధులు విడుదలయితే అభివృద్ధి పనులు తిరిగి ప్రారంభమై ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు.

Tags:

Advertisement

Latest News

అందెగత్తెలతో అదిరిపోయిన పాతబస్తీ.. అందెగత్తెలతో అదిరిపోయిన పాతబస్తీ..
ముద్దుగుమ్మల వాక్ తో కళకళలాడిన ఓల్డ్ సిటీహెరిటేజ్ వాక్ తో కోలాహలంగా మారిన చార్మినార్అందెగత్తెలు అదిరిపోయే రేంజ్ లో స్వాగతం పలికిన లాడ్ బజార్ వ్యాపారులుచౌమోహల్లా ప్యాలెస్...
చీటింగ్ కేసులో ఓ ఛానల్ అధినేత శ్రవణ్ రావు అరెస్ట్
పాతబస్తీ చాంద్రాయణగుట్టలో భారీ ర్యాలీ
పోటాపోటీగా ఎక్సైజ్ టీమ్ ల దాడులు.. భారీగా గంజాయి స్వాధీనం
గ్రామపంచాయతీ ఉద్యోగుల సభకు రావాలని మంత్రికి వినతి
నిధుల కేటాయింపుకై కమిషనర్ కి ఎమ్మెల్యే వినతి
నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్