అధిక పెన్షన్‌ పై అయోమయం.. పోరాటానికి సిద్ధమైన సంఘం

By Ravi
On
అధిక పెన్షన్‌ పై అయోమయం.. పోరాటానికి సిద్ధమైన సంఘం

IMG-20250524-WA0040అధిక పెన్షన్‌ కోసం ఉద్యోగ సంఘాలు ఆందోళనకు సిద్ధమైనారు. రిజెక్ట్‌ పేరుతో చాల దరఖాస్తులను తిరస్కరణపై ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి. మరోమారు పూర్తి స్థాయిలో దరఖాస్తుల పరిశీలనకు అనుమతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.  అధిక పెన్షన్‌ కోసం దరఖాస్తులు చేసుకున్న పెన్షన్‌ ఉద్యోగులు చేసుకున్న దరఖాస్తులను గుట్టలుల గుట్టలుగా రిజెక్ట్‌ చేయడంపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.  దరఖాస్తులను తిరస్కరించడంపై ఉద్యోగ సంఘాల నాయకులు ఎన్నిమార్లు పెన్షన్‌ ఉద్యోగులకు న్యాయం చేయాలని వినతి పత్రాలు ఇచ్చిన ఈపీఎఫ్‌ పట్టించుకోవడం లేదని, దీంతో  పెన్షన్‌ ఉద్యోగులు ఉద్యోగసంఘాలపై తీసుక వస్తున్న ఒత్తిడితో అధిక  పెన్షన్‌ అర్హత కలిగిన వారికి ఇప్పించడం ఎలా అనే సందేహంలో మార్గ అన్వేషణపై దృష్టి పెట్టారు. ఉద్యోగులకు, పదవీ విరమ పొందిన వారికి అధిక పెన్షన్‌ విధానాన్ని తీసుక వచ్చి అదుకుంటామని కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడంతో ఉద్యోగుల్లో ఒకింత అనందం వెళ్లి విరిసింది. అర్హత కలిగి పెన్షన్‌దారులు పెద్దఎత్తున దరఖాస్తులను చేసుకున్నారు. అధిక పెన్షన్‌ వస్తుందని ఆశ పడిన పెన్షన్‌దారులందరి దరఖాస్తుల తిరస్కరణతో ఒక్కసారిగా అందరిలో నిరాశ  ఏర్పడింది. ఈపీఎఫ్‌ సూచించిన నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకున్న రిజెక్ట్‌ ఎందుకు చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. రిజెక్ట్‌ చేయడానికి కారణాలు ఏమిటీ అంటే ఈపీఎఫ్‌ కార్యాలయాల్లో సమాధానం చెప్పె పరిస్థితి లేదు. 2014 సెప్టెంబరు 1 చేరి, 2014 సెప్టెంబర్‌ సర్వీస్‌లో కొనసాగు తున్న ఉద్యోగులకు  పెన్షన్‌ నిధి 1995 ప్రకారం అధిక పెన్షన్‌ కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఈపీఎఫ్‌ కోరింది. 
అధిక పెన్షన్‌ కోసం కొత్త ఆపన్షన్‌కు అవకాశం కల్పించారు. వచ్చిన దరఖాస్తు లను పరిశీలినలో ఏర్పడిన సమస్యలను పరిష్కరించడానికి నిధి ఆప్‌కే నికత్‌ పేరుతో తీసుక వచ్చిన కూడ పెన్షన్‌ ఉద్యోగులకు అధిక పెన్షన్‌ సమస్యలు పరిష్కరించబడలేదు.
అధిక పెన్షన్‌ దరఖాస్తుల 2014 సెప్టెంబరు 1కి ముందు పదవీ విరమణ చేసిన వారు 4,10,039 మంది ఉద్యోగలు ఉన్నారు. 2014 సెప్టెంబర్‌ 1 తర్వాత పదివీ విరమణ చేసిన వారు13,38,729 మంది ఉన్నారు. 
ఈ రెండు విభాగాల్లో ఈ పీఎప్‌ 16,503 మంది పెన్షనర్ల 2014 సెప్టెంబర్‌ ముందు పదవీ విరమణ చేసిన వారి దరఖాస్తులను, 2014  సెప్టెంబరు 1 తర్వాత పదవీ వివరమణ చేసిన వారి 6200 దరఖాస్తులను ఈపీఎప్‌ రిజెక్ట్‌ చేసింది.  అందరు పదవీ విమరణ పొందిన ఉద్యోగులు అధిక పెన్షన్‌ కోసం చేసుకున్న  దరఖాస్తులను ఒకరీతిలో దరఖాస్తులు చేసుకున్నారు. కాని 22 వేల మంది ఉద్యోగుల దరఖాస్తులను మాత్రం ఈపీఎప్‌ రిజెక్ట్‌ చేయడం ఏమిటీ అనే అనుమానాలు అందరిలోను  కలుగుతున్నాయి. ఈ విషయంలో పెన్షనర్లు, ఉద్యోగ సంఘాల నాయకులు ఈ పీఎప్‌      తీరుపై మండిపడుతున్నారు. అధిక పెన్షన్‌ కోసం ఉద్యోగులు చేసుకున్న దరఖాస్తులో 22 వేల మంది దరఖాస్తులను తిరస్కరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోరువ చూపి రిజెక్ట్‌ చేసిన దరఖాస్తులను తిరిగి పరిశీలించాలని, అందరికి అధిక పెన్షన్‌ను వచ్చెలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ  ప్రభుత్వ రంగ ఉద్యోగుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి జీ.టి .జీవన్‌ డిమాండ్‌ చేస్తున్నారు. 
పెన్షన్‌ ఉద్యోగులకు అధిక పెన్షన్‌ అర్హులైన వారికి అందరికి అందికపోతే ఉద్యోగ సంఘాలు మరో మారు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందని అన్నారు. పెన్షనర్లకు అధిక పెన్షన్‌ ఇప్పించడానికి అన్ని రకాల ఉద్యోగ సంఘాలు కలిసి ముందుకు రావాలని, అవసరమైతే అన్ని ఉద్యోగాల సంఘాల సమాఖ్య ఏర్పాటు చేసి పెన్షనర్‌ ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటాలకు సిద్దం కావాలని ఆయన పిలుపు నిచ్చారు. తెలంగాణ పభ్రుత్వ రంగ ఉద్యోగుల అధ్యక్ష, కార్యదర్శులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి,      తదుపరి కార్యచరణ ఏర్పాటు చేసుకొని, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ మంత్రులను, ఉన్నతాధికారులకు  కలిసి వినతి పత్రాలను అందించనున్నామని తెలిపారు.  అనంతరం తెలంగాణ ఈపీఏప్ కార్యాలయం ముందు ఆందోళన, ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు.

Tags:

Advertisement

Latest News

నన్ను వేశ్యలాగా చూశారు..వివాదాస్పదమైన మిస్ వరల్డ్ పోటీలు నన్ను వేశ్యలాగా చూశారు..వివాదాస్పదమైన మిస్ వరల్డ్ పోటీలు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలు అపవాదును మూటగట్టుకుంది. ఈ పోటీల్లో ఖండాల వారీగా 24 మంది విజేతలను ఎంపిక చేశారు. వారిలో...
కల్వ సుజాతపై డీఎస్పీకి ఫిర్యాదు..
టాలీవుడ్‌ ఫోర్‌ పిల్లర్స్‌కు పవన్‌ రిటర్న్‌ గిఫ్ట్‌..!
అధిక పెన్షన్‌ పై అయోమయం.. పోరాటానికి సిద్ధమైన సంఘం
గ్రామ పాలన అధికారి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి - సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్
కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ..