కల్వ సుజాతపై డీఎస్పీకి ఫిర్యాదు..
By Ravi
On
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్ పర్సన్, తాండూరుకు చెందిన కల్వ సుజాతపై స్థానిక బీజేపీ నేతలు తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డికి ఫిర్యాదును అందజేశారు. ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్ పర్సన్ హోదాలో ఉన్న కల్వ సుజాత ఫేస్ బుక్‌లో తన ఖాతా నుంచి దేశ ప్రధాని నరేంద్ర మోదిపై ఆయనను అగౌరవ పరిచేలా వీడియోను పోస్ట్ చేశారని ఆరోపించారు. దేశ ప్రధానిపై మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్దేశ్యపూర్వకంగా చేసిన పోస్టును ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశ ప్రధానిని, దేశ పౌరుల మనోభావాలకు భంగం కలిగించే రీతిలో ఉన్న పోస్టును తొలగించాలని కోరారు. ప్రధానిపై ఫేక్ పోస్టు చేసిన కల్వ సుజాతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Tags:
Latest News
25 May 2025 06:44:58
శంషాబాద్ వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వాహనాల తనిఖీ చేస్తున్న పోలీస్ పెట్రోలింగ్ వాహనాని లారీ ఢీకొంది. ప్రమాదంలో విజయ్ కుమార్...