కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి
By Ravi
On
మూడుచింతలపల్లి మండలంలోని ఉద్దమర్రి, కేశవరంలో ధాన్య కొనుగొలు కేంద్రాలను అదనపపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి పరిశీలించారు. రైతులతో మాట్లాడుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యాన్ని పరిశీలించి, అకాల వర్షాల నుండి అన్ని ముందుస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, కొనుగోలును వేగవంతం చేయాలని, ధాన్యాన్ని రైస్ మిల్లులకు మారాలని, ఓపీఎంఎస్ ఎంట్రీలను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ధాన్య కొనుగొలు కేంద్రాలకు వెంటనే అదనపు వాహనాలను అందించాలని వరి రవాణా కాంట్రాక్టర్కు సూచించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై శాఖ డిఎం సుగుణ బాయి, డీసీఎస్ఓ, తహశీల్దార్, డీటీసీలు పాల్గొన్నారు.
Tags:
Latest News
24 May 2025 20:53:05
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలు అపవాదును మూటగట్టుకుంది. ఈ పోటీల్లో ఖండాల వారీగా 24 మంది విజేతలను ఎంపిక చేశారు. వారిలో...