డ్రగ్స్ కేసులో ప్రముఖ లేడీ డాక్టర్ అరెస్ట్

By Ravi
On
డ్రగ్స్ కేసులో ప్రముఖ లేడీ డాక్టర్ అరెస్ట్

డ్రగ్స్ కి బానిసైన ఓ డాక్టర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని ఓ ప్రముఖ హాస్పిటల్ లో డాక్టర్ గా పని చేస్తున్న నమ్రత(34) వాట్సాప్ లో ముంబైకి చెందిన వంశ్ ధక్కర్ కు 5 లక్షల రూపాయల కొకైన్ డ్రగ్స్ ఆర్డర్ చేసింది. ఆన్లైన్ లో డబ్బును వాన్స్ వంశ్ ధక్కర్ కు పంపిన తరువాత డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న బాలకృష్ణ రాoప్యార్ అలియాస్ రామ్(38) ద్వారా నగరానికి డ్రగ్స్ ను పంపారు. రాయదుర్గంలో లేడీ డాక్టర్ కు డ్రగ్స్ అందజేస్తుండగా పక్కా సమాచారంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న రాయదుర్గం పోలీసులు పట్టు బడ్డ వారి వద్ద నుండి 5 లక్షల రూపాయల విలువైన 53 గ్రాముల కొకైన్ డ్రగ్స్, పదివేల నగదు,రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ గా పనిచేస్తున్న నమ్రత డ్రగ్స్ కు బానిసగా మారి ఇప్పటివరకు 70 లక్షల రూపాయల వరకు డ్రగ్స్ కోసం ఖర్చు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

Tags:

Advertisement

Latest News

మలక్ పేటలోని మామిడి పండ్ల గోదాములపై దాడి.. ఇద్దరి అరెస్ట్ మలక్ పేటలోని మామిడి పండ్ల గోదాములపై దాడి.. ఇద్దరి అరెస్ట్
మలక్ పేటలోని మామిడిపండ్ల గోదాంలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు, జీహెచ్‌ఎంసీ ఫుడ్‌ సేఫ్టీ అధికారులు దాడులు జరిపారు.  ప్రజల ఆరోగ్యానికి హానికరమైన కార్బైడ్‌ ను వినియోగిస్తూ కృత్రిమ...
మీ వాట్సాప్ లు జర భద్రం
భద్రాచలం దేవాలయంలో ప్రత్యేక పూజలు
గురునానక్ ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ లో విద్యార్థిని సూసైడ్
హైదరాబాద్ లో బాణసంచా కాల్చడం బ్యాన్
సిసిఐ కంపెనీలో అనుమానాస్పద స్థితిలో కార్మికుడు మృతి.. ఆందోళన
డ్రగ్స్ కేసులో ప్రముఖ లేడీ డాక్టర్ అరెస్ట్