కరాచీ బేకరీ వద్ద బీజేపీ ఆందోళన.. బోర్డ్ ధ్వంసం
By Ravi
On
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయం రహదారిలో కరాచీ బేకరీ వద్ద బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు.
భారత్ - పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతున్న నేపథ్యంలో కరాచీ బేకరీ పేరును నిరసిస్తూ నాయకులు ఆందోళనకు దిగారు. కరాచీ బోర్డు ధ్వంసం చేశారు. దీనితో బేకరీ సిబ్బంది కరాచీ బోర్డ్ ని నల్ల కవర్లతో కప్పేశారు. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన బీజేపీ నేతలు తక్షణమే కరాచీ పేరును తొలగించి వేరే బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను సముదాయించిన పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags:
Latest News
12 May 2025 11:31:10
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్ చేసిన అనుచిత వాక్యాలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ నాయకులు ఆయన ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. యూత్...