మీర్పేట్ లో కామ్రేడ్ ఠాణు నాయక్ విగ్రహావిష్కరణ
మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల చందనం చెరువు సమీపంలో, తెలంగాణ గిరిజన లంబాడి ఉద్యమ నాయకుడు జోటాతూ ఠాణు నాయక్ విగ్రహాన్ని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆవిష్కరించారు. నీరు భూమి కోసం, భుక్తి కోసం, ముక్తి కోసం పోరాడిన ధైర్యవంతుడు. నిజాం రజాకర్లను ధైర్యంగా ఎదిరించి, ధర్మపూర్ తండా పోరుగడ్డను విముక్తి చేసిన అమరుడిగా లంబాడీ సమాజానికి ఆదర్శంగా నిలిచారని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రవీందర్ నాయక్, డిఐసిసి చైర్మన్ చల్లా నరసింహారెడ్డి, తీగల విక్రం రెడ్డి అరకల భూపాల్ రెడ్డి, శీను నాయక్, దీప్లాల్ చౌహాన్, అర్కల కామేష్ రెడ్డి, కొలను శంకర్ రెడ్డి, బొక్క రాజేందర్ రెడ్డి, భూపేష్ గౌడ్, మదారి రమేష్ , పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి, విజయలక్ష్మి, సునీత బాలరాజ్ మరియు గిరిజన లంబాడి సోదరులు భారీగా హాజరయ్యారు.