తాండూరు కాంగ్రెస్ పార్టీ సమావేశంలో బయట విభేదాలు
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మంగళవారం తులసి గార్డెన్లో తాండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాక సమావేశం తులసి గార్డెన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, అబ్జర్వర్లు వినోద్ రెడ్డి, నరేందర్ హాజరయ్యారు.
ఈ క్రమంలో భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు హాజరయ్యారు. ఇదిలా ఉండగా పార్టీ అందిస్తున్న పలు సంక్షేమ పథకాల పై నాయకులు కార్యకర్తలు కు సూచించారు. ఇందులో భాగంగా తాండూర్ కాంగ్రెస్ పార్టీ కి బీజమైన మాజీ మంత్రి మాణిక్ రావు తనయుడు టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ నెంబర్ రమేష్ మహారాజ్ ఒక్కసారిగా తాండూర్ సమావేశానికి హాజరయ్యారు. సభ వేదికపై ఆయనకు చోటు లేకపోవడంతో కార్యకర్తల మధ్యన కూర్చున్నాడు. ఆ తర్వాత వేదికపైకి అయనను విలువగా. వేదికపైకి వెళ్ళిన అనంతరం ఆయన సభా వేదిక ను ఉద్దేశించి మాట్లాడుతూ...
తాండూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అంటేనే మా రాజులని కాంగ్రెస్ పార్టీకి బీజం పోసిన కార్యకర్తలను నాయకులను ప్రస్తుతం ఉన్న బి కాంగ్రెస్ నాయకులు పట్టించుకోవడంలేదని, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు. దీంతో సభా వేదికపై ఉన్న నాయకులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. దీంతో కాంగ్రెస్లో విబేధాలు బయటపడ్డాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు హవా నడుస్తుందని భావాద్వేగంతో తన మనసులో మాట చెప్పారు.