ఆదాయవనరులు పెంచండి.. సమీక్షలో అధికారుల ఆదేశాలు

By Ravi
On
ఆదాయవనరులు పెంచండి.. సమీక్షలో అధికారుల ఆదేశాలు

IMG-20250520-WA0091నేరాలను అరికట్టండి.. ఆదాయ వనరులను పెంచాలని తెలంగాణ ఎక్సైజ్‌ అధికారుల సమీక్షా సమావేశంలో కమిషనర్ సి.హరి కిరణ్‌,  డైరెక్టర్‌ షానవాజ్‌ ఖాసీం అన్నారు. త్వరలో ఎక్సైజ్‌ శాఖలో ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ పూర్తి కానుందన్నారు. శాఖలో అన్ని స్థాయిల్లో క్రైమ్‌ను  అరికట్టడంతో పాటు ఎక్సైజ్‌ శాఖకు ఆదాయ వనరులను పెంపొందించడంపై అందరు దృష్టి సారించాలని కమిషనర్‌ సి.హరికిరణ్‌ చెప్పారు. ఎక్సైజ్‌ భవన్‌లో మంగళవారం సాయంత్రం సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో పలు సూచనలు చేశారు.  ఈ సమావేశంలో అడిషనర్‌ కమిషనర్‌, జాయింట్‌ కమిషనర్లు, డిప్యూటి కమిషనర్లు,  అసిస్టెంట్‌ కమిషనర్లు , ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ లు  పాల్గొన్నారు. జనవరి 25 నుంచి ఏప్రిల్‌ నాలుగు నెలల్లో క్రైమ్‌ రేటింగ్‌,  రెవెన్యూ వ్యవహరాలపై ప్రధానంగా కమిషనర్‌, డైరెక్టర్‌ సమీక్షించారు. ప్రధానంగా రాబోయే వర్షాకాలంలో ఎక్సైజ్‌శాఖకు మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా కేటాయించిన 25 లక్షల తాటి, ఈత  వనాలను పెంచడానికి అవసరమైన మొక్కలను నాటాలని కమిషనర్‌ ఆదేశించారు. త్వరలో మంత్రులు కూడ మొక్కలు నాటే కార్యక్రమంపై సమీక్షించనున్నారని,  ఈ విషయంలో అప్రమత్తంగా ఉండి మొక్కలు నాటాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్‌తోపాటు మిథనాల్‌ వినయోగంపై ఎక్సైజ్‌శాఖ గట్టి   నిఘా పెట్టాలని, కామారెడ్డిలో జరిగిన ఘటన  రీతిలో మరోమారు జరిగితే ఊరుకునేది లేదని కమిషనర్‌ ఎక్సైజ్‌ శాఖను హెచ్చరించారు.  ఆల్పోజోలం, మిథనాలు, ఇతర మార్గాల్లో ప్రజలను ఇబ్బంది కల్తీ  మద్యం, ఫ్యూరియస్ లిక్కర్, ఎన్‌డిపీఎల్‌ లిక్కర్‌ ను కట్టడి చేయాలన్నారు. త్వరలో కానిస్టేబుళ్ల నుంచి అన్ని స్థాయిలో పదోన్నతులు, బదిలీలు పూర్తి చేస్తామని అన్నారు. అన్ని స్థాయిలో బదిలీ, ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి అయ్యిందని కమిషనర్‌ తెలిపారు. ఎన్‌డీపీఎల్‌ మద్యాన్ని అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకోవాలని  డైరెక్టర్‌ షాన్‌వాజ్‌ ఖాసిం అన్నారు. 

Tags:

Advertisement

Latest News

తాండూరు కాంగ్రెస్ పార్టీ సమావేశంలో బయట విభేదాలు తాండూరు కాంగ్రెస్ పార్టీ సమావేశంలో బయట విభేదాలు
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మంగళవారం తులసి గార్డెన్లో తాండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాక సమావేశం తులసి గార్డెన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...
దుండిగల్ లో పాత నేరస్థుల అరెస్ట్.. భారీగా సొత్తు స్వాధీనం
30మందికి క్యాష్ రివార్డ్స్ అందించిన ఎక్సైజ్ డైరెక్టర్
ఆదాయవనరులు పెంచండి.. సమీక్షలో అధికారుల ఆదేశాలు
ఘట్కేసర్ ఓఆర్ఆర్ పై అయిదుగురు అరెస్ట్. 58.8కేజీల గంజాయి స్వాధీనం
మెట్రో రైల్ ప్రయాణికులకు శుభవార్త
బిఆర్ఎస్ బాస్ కి బిగుసుకున్న ఉచ్చు..