దుండిగల్ లో పాత నేరస్థుల అరెస్ట్.. భారీగా సొత్తు స్వాధీనం

By Ravi
On
దుండిగల్ లో పాత నేరస్థుల అరెస్ట్.. భారీగా సొత్తు స్వాధీనం

జల్సాలకు అలవాటు పడి అక్రమ సంపాదనే లక్ష్యంగా రాత్రిపూట ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు పాత నేరస్థులను మేడ్చల్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. సూరారం కాలనీకి చెందిన హరిబాబు (20), సూర్య (20) అనే నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుండి 14 తులాల బంగారం, 1కేజి వెండి, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు .వీరిపై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్ల పరిధుల్లో ఒకరిపై 8 మరోకరిపై 6 దొంగతనం కేసులు ఉన్నట్లు ఎసిపి శంకర్ రెడ్డి తెలిపారు. పలు కేసుల్లో  జైలుశిక్ష అనుభవించి వచ్చిన వారి ప్రవర్తనలో తేడా లేదని మేడ్చల్ ఎసిపి వెల్లడించారు.ఈ మీడియా సమావేశంలో దుండిగల్ మరియు సూరారం పిఎస్ సిసిఎస్ మేడ్చల్ పోలీసులు, దుండిగల్ సీఐ సతీష్, సూరారం సీఐ భరత్ కుమార్, సూరారం పిఎస్ డిఐ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

తాండూరు కాంగ్రెస్ పార్టీ సమావేశంలో బయట విభేదాలు తాండూరు కాంగ్రెస్ పార్టీ సమావేశంలో బయట విభేదాలు
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మంగళవారం తులసి గార్డెన్లో తాండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాక సమావేశం తులసి గార్డెన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...
దుండిగల్ లో పాత నేరస్థుల అరెస్ట్.. భారీగా సొత్తు స్వాధీనం
30మందికి క్యాష్ రివార్డ్స్ అందించిన ఎక్సైజ్ డైరెక్టర్
ఆదాయవనరులు పెంచండి.. సమీక్షలో అధికారుల ఆదేశాలు
ఘట్కేసర్ ఓఆర్ఆర్ పై అయిదుగురు అరెస్ట్. 58.8కేజీల గంజాయి స్వాధీనం
మెట్రో రైల్ ప్రయాణికులకు శుభవార్త
బిఆర్ఎస్ బాస్ కి బిగుసుకున్న ఉచ్చు..