జైహింద్ అంటూ ఎక్స్ లో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పోస్ట్

By Ravi
On
జైహింద్ అంటూ ఎక్స్ లో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పోస్ట్

పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత రక్షణ దళాలు దాడులు నిర్వహించాయన్న వార్తల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాయకులు సైతం ఈ చర్యను స్వాగతిస్తూ, భారత సత్తాను చాటారని ప్రశంసించారు.ఈ దాడులను పహల్గామ్ ఉగ్రదాడికి సరైన ప్రతీకారమని అభిప్రాయపడ్డారు. ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఈ దాడులను స్వాగతిస్తూ 'ఎక్స్' వేదికగా స్పందించారు. "పాకిస్థాన్‌లోని ఉగ్రవాద రహస్య స్థావరాలపై మన రక్షణ దళాలు జరిపిన లక్షిత దాడులను నేను స్వాగతిస్తున్నాను. మరో పహల్గామ్ వంటి ఘటన పునరావృతం కాకుండా పాకిస్థాన్ కు గట్టి గుణపాఠం చెప్పాలి. పాకిస్థాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయాలి," అని ఒవైసీ పేర్కొన్నారు. తన పోస్ట్‌ను ఆయన 'జై హింద్' నినాదంతో ముగించారు.

Tags:

Advertisement

Latest News

ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి షాక్ ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి షాక్
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై. శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఊహించని పరిణామం ఎదురైంది. ఈ కేసు నుంచి ఆమెను విముక్తురాలిని చేస్తూ...
లోప రహిత క్రమశిక్షణ.. అప్పీల్ కేసుల నిర్వహణపై సదస్సు
నార్సింగిలో విషాదం.. అగ్నిప్రమాదంలో కొరియోగ్రాఫర్ మృతి
55ఏళ్ల తరువాత వార్ సైరన్లు వాడాము.. సీపీ ఆనంద్
జవహర్ నగర్ లో విషాదం.. లిఫ్ట్ తెగిపడి ముగ్గురు మృతి
పేరుకి కార్ల వ్యాపారం.. చేసేది నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విక్రయం
అదరగొట్టిన ఆపరేషన్ అభ్యాస్