పాతబస్తీలో మరో అగ్నిప్రమాదం
By Ravi
On
పాతబస్తీలో మరో అగ్నిప్రమాదం సంభవించింది. ఛత్రినాఖా బోయిగూడా ప్రాంతంలోని ఓ భవనం రెండవ అంతస్తులో మంటలు చెలరేగాయి. విషయం గమనించిన స్థానికులు ఇంట్లో ఉన్నవారిని సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన స్పాట్ కి వచ్చిన రెండు ఫైర్ ఇంజన్లు మంటలు అదుపులోకి తెచ్చాయి. రెండవ అంతస్తులో చెప్పుల గోదాంలో షాట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించిందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేశారు.
Tags:
Latest News
20 May 2025 21:24:46
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మంగళవారం తులసి గార్డెన్లో తాండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాక సమావేశం తులసి గార్డెన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...