పాతబస్తీ అగ్నిప్రమాద ఘటనపై కమిటీ ఏర్పాటు.. విచారణ ప్రారంభం..
By Ravi
On
పాతబస్తీ గుల్జార్ హౌజ్ అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు ఏర్పాటు చేశారు. ఇందులో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్ గా వ్యవహరించనున్నారు. అలాగే ఈ కమిటీల్ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురశెట్టి, హైదరాబాద్ సీపీ సివి ఆనంద్ , ఫైర్ డీజీ నాగిరెడ్డి , హైడ్రా కమిషనర్ రంగనాథ్ ,TSSPDCL సిఎండి ముషారఫ్ లతో కమిటీ రూపొందించారు. స్థానిక ఎమ్మార్వోతో పాటు పలువురు అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని కృష్ణ, మోదీ పెరల్స్ లోపలికి వెళ్లి విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదంలో మోదీ ముత్యాల వ్యాపారికి చెందిన మూడు తరాల కుటుంబ సభ్యలు మొత్తం 17 మంది చనిపోయిన సంగతి తెలిసిందే.
Tags:
Latest News
20 May 2025 21:24:46
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మంగళవారం తులసి గార్డెన్లో తాండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాక సమావేశం తులసి గార్డెన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...