ఘట్కేసర్ ఓఆర్ఆర్ పై అయిదుగురు అరెస్ట్. 58.8కేజీల గంజాయి స్వాధీనం

By Ravi
On
ఘట్కేసర్ ఓఆర్ఆర్ పై అయిదుగురు అరెస్ట్. 58.8కేజీల గంజాయి స్వాధీనం

మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధి ఘట్కేసర్ ఓఆర్ఆర్ వద్ద 58.8కిలోల పొడి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా నుండి ఆదిలాబాద్, ఆదిలాబాద్ టు పూణే తరలించేందుకు ఐదుగురు వ్యక్తులు  కారులో తరలిస్తుండగా ఓఆర్ఆర్ ఘట్కేసర్ వద్ద ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుండి 58.8కిలోల పొడి గంజాయి, ఐదు మొబైల్ ఫోన్స్, కారు స్వాధీనం చేసుకున్నారు.  ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ పి. దశరథ మాట్లాడుతూ ఒరిస్సాలోని సునీల్ జన్నె నుండి 29 బండిల్ పొడి గంజాయి, కేజీకి 1900 రూపాయల చొప్పున కొనుగోలు చేశారు. వీటిని కిలోకి ఐదు వేల చొప్పున అమ్మకాలు చేపడతారు. గోవింద్ తప్సలే (36), గజానంద్(21), పవన్(25), ఆకాష్(32) రాహుల్ (31) ఈ నలుగురు వ్యక్తులు బీదర్ జిల్లా కర్ణాటక కు చెందిన వ్యక్తులు, అంబేద్కర్ నగర్ అదిలాబాద్ చెందిన మరో వ్యక్తి రాహుల్(31) అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అదిలాబాదులోకి చెందిన రాహుల్ పూణేలో ఉండే అభిషేక్ తరలించేందుకు కారులో ప్లాన్ చేశారని రాహుల్ పై గతంలో కేసులు ఉన్నట్లు వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో  మల్కాజిగిరి ఎక్సైజ్ అధికారి నవీన్ కుమార్, ఘట్కేసర్ ఎక్సైజ్ సిఐ జూపల్లి రవి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

తాండూరు కాంగ్రెస్ పార్టీ సమావేశంలో బయట విభేదాలు తాండూరు కాంగ్రెస్ పార్టీ సమావేశంలో బయట విభేదాలు
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మంగళవారం తులసి గార్డెన్లో తాండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాక సమావేశం తులసి గార్డెన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...
దుండిగల్ లో పాత నేరస్థుల అరెస్ట్.. భారీగా సొత్తు స్వాధీనం
30మందికి క్యాష్ రివార్డ్స్ అందించిన ఎక్సైజ్ డైరెక్టర్
ఆదాయవనరులు పెంచండి.. సమీక్షలో అధికారుల ఆదేశాలు
ఘట్కేసర్ ఓఆర్ఆర్ పై అయిదుగురు అరెస్ట్. 58.8కేజీల గంజాయి స్వాధీనం
మెట్రో రైల్ ప్రయాణికులకు శుభవార్త
బిఆర్ఎస్ బాస్ కి బిగుసుకున్న ఉచ్చు..