పాతబస్తీలో దారుణం.. మహిళ గొంతుకోసి మృతదేహం తగలబెట్టిన దుండగులు
By Ravi
On
చాంద్రాయణగుట్ట పిఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. కేశవగిరి ప్రాంతంలో ఓ ఇంట్లో నుండి మంటలు వస్తున్నాయంటూ స్థానికులు డయల్ 100కి సమాచారం ఇచ్చారు. నైట్ డ్యూటీలో ఉన్న బండ్లగూడ సిఐ గురునాథ్, సైబర్ క్రైమ్ డీసీపీ కవిత స్పాట్ కి వచ్చారు. అగ్నిమాపక సిబ్బందితో కలిసి మంటలు అదుపు చేసి లోపలికి వెళ్లి చూసేసరికి అసలు విషయం బయటపడింది. మృతురాలు కేతవత్ బుజ్జిగా గుర్తించారు. కూలి పని చేసుకొని జీవనం సాగిస్తున్న ఆమెను అగంతకులు గొంతు కోసి హత్య చేసి మృతదేహాన్ని కాల్చినట్లు తెలుసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
Tags:
Latest News
08 May 2025 13:55:58
ఇక హైదరాబాద్ అదిరిపోనుంది.. ప్రపంచస్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించబోతుంది. ఎక్కడ చూసినా సందడే నెలకొననుంది.. ఎక్కడ చూసినా హంగు ఆర్భాటలతో సందు సందు స్వాగతం పలుకుతున్నాయి. అదే...