హైదర్ నగర్ లో విరుచుకుపడ్డ హైడ్రా.. షెడ్ల తొలగింపు
By Ravi
On
కూకట్పల్లిలో హైడ్రా మరోసారి విరుచుకుపడింది. హైదర్ నగర్ ప్రాంతంలో సర్వేనెంబర్ 145/3లో అక్రమంగా ఏర్పాటు చేసిన షెడ్లను హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. భారీ బందోబస్తు నడుమ ఇతరులను సైతం లోపలికి అనుమతించకుండా కట్టుదిట్టం చేసి ఈ కూల్చివేతలు చేపట్టారు. ప్రభుత్వ భూమిలో కొందరు షెడ్లను ఏర్పాటుచేసి వ్యాపారాలను సాగించడమే కాకుండా ఇతరులకు అద్దెకిచ్చి సొమ్ము చేసుకుంటున్నారని హైడ్రాకు ఫిర్యాదు అందింది. దీనిపైన సమగ్ర విచారణ చేపట్టిన అధికారులు అది ప్రభుత్వ స్థలమే అని అనధికారిక నిర్మాణాలు జరిగాయని విచారణలో తేలిన తరువాత వాటిని నేలమట్టం చేశారు.
Tags:
Latest News
19 May 2025 13:45:33
బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఐఎన్టీయుసీ నేతలు పరస్పర దాడులకు పాల్పడ్డారు. ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (INTUC) సంఘాల నాయకుల మధ్య గొడవ...