చిట్టి డబ్బులు ఇవ్వలేదని ఎంత పని చేశారు..
చిట్టీ డబ్బు విషయంలో తలెత్తిన గొడవలో ఓ మహిళ కుడిచేతి చూపుడు వేలిని చిట్టి నిర్వాహకుడు గట్టిగా కొరికేశాడు. దీంతో ఊడిపోయిన వేలిని పట్టుకుని ఆస్పత్రికి వెళ్లినప్పటికీ అతికించలేమని వైద్యులు తేల్చిచెప్పారు. హైదరాబాద్ మధురానగర్ పోలీస్టేషన్ పరిధిలోని జవహర్ నగర్ లో ఈ దారుణం చోటుచేసుకుంది. జవహర్ నగర్ కు చెందిన సుజిత ఇంట్లోని పెంట్ హౌస్ లో మూడేండ్ల నుంచి మమత అద్దెకు ఉంటుంది. మమత చిట్టీల వ్యాపారం చేసేది. మమతకు రూ.30 వేలు చిట్టీ డబ్బులు సుజిత ఇవ్వాల్సి ఉంది. ఇటీవల మమత ఇల్లు ఖాళీ చేసి వెళ్లింది. చిట్టీ డబ్బులు వసూలు చేసుకునేందుకు సుజిత ఇంటికి మమత, ఆమె భర్త హేమంత్ వచ్చారు. చిట్టి డబ్బులు ఇవ్వాలని పట్టుబట్టారు ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. సుజిత తల్లి లత(45) అడ్డురావడంతో ఆమె కుడి చెయ్యి చూపుడు వేలిని హేమంత్ కొరికేశాడు. ఊడిన వేలిని పట్టుకుని ఆసుపత్రికి పరుగులు తీయగా, ఆ వేలిని అతికించలేమని వైద్యులు తేల్చిచెప్పారు. సుజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి హేమంత్ ను అరెస్ట్ చేశారు.