ప్రజా సంబంధాలు మెరుగు పరుచుకోండి.. డీజీపీ జితేందర్
విధి నిర్వహణలో రానించేందుకు ప్రజా సంబంధాలను మెరుగుపరుచుకోవాలని రాష్ట్ర డిజిపి డాక్టర్ జితేందర్ అసిస్టెంట్ ఎస్పీలతో అన్నారు. రాష్ట్ర డిజిపి కార్యాలయంలో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న అసిస్టెంట్ ఎస్పీలు, శిక్షణలో ఉన్న అసిస్టెంట్ ఎస్పీల పనితీరును డిజిపి సమీక్షించారు. ఈ సందర్భంగా ఏఎస్పీలుగా వారు విధులు నిర్వహిస్తున్న ప్రాంతాల పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు. వివిధ ప్రాంతాల పరిస్థితులపై తనకు ఉన్న సంబంధాలను, అనుభవాన్ని ఏఎస్పిలతో పంచుకున్నారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ విధి నిర్వహణలో రాణించేందుకు ప్రజా సంబంధాలను మెరుగుపరుచుకోవాలని తద్వారా నేరాలకు సంబంధించిన సమాచారం, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు తెలుసుకోవచ్చని డిజిపి అన్నారు. చట్ట పరిధిలో వివిధ శాఖల అధికారులతోనూ, ఉన్నతాధికారులతోనూ, సత్సంబంధాలను కలిగి ఉండాలని తద్వారా ఉత్తమ పోలీసు అధికారులుగా గుర్తింపు పొందవచ్చనీ తన అనుభవలను డిజిపి డాక్టర్ జితేందర్ వివరించారు. ఎఎస్పీలుగా విధులు నిర్వహిస్తున్న అధికారులు తమ ప్రాంతాల్లో ఉన్న ఆచారాలు, కట్టుబాట్లు గురించి తెలుసుకోవాలని హితవు చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా కొత్త కార్యక్రమాలను చేపడుతున్నప్పటికీ బేసిక్ పోలీసింగు ను మరవరాదన్నారు. ఇకపై ప్రతినెల ఎఎస్పీలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తానని డీజీపి తెలిపారు. హత్యలు, ఆర్థిక నేరాలు జరుగుతున్న చోట జాగ్రత్త వహించాలన్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేసినట్లయితే నేరస్తులను సులువుగా గుర్తించే అవకాశం ఉంటుందని అన్నారు. శాంతి భద్రతల అడిషనల్ డిజిపి శ్రీ మహేష్ ఎం భగవత్, ఐ జి పి లు శ్రీ చంద్రశేఖర్ రెడ్డి, శ్రీ వి సత్యనారాయణ, శాంతిభద్రతల ఏఐజి శ్రీ రమణ కుమార్ తదితరులు తమ అనుభవాలను తెలియజేశారు. అసిస్టెంట్ ఎస్పీలు బి. చైతన్య , ఆర్. రాహుల్ రెడ్డి, కాజల్ , అవినాష్ కుమార్ , శివ ఉపాధ్యాయ, చేతం నితిన్ , శుభం, పి. మౌనిక , శేషాద్రిని రెడ్డి, వసుంధర యాదవ్, మానం బట్, రిత్విక్ సాయి, సాయికిరణ్ లు సమీక్ష సమావేశానికి హాజరయ్యారు.