మేడ్చల్ లో మహిళ దారుణ హత్య
By Ravi
On
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళను అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటన చోటుచేసుకుంది. మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని అత్వల్లి గ్రామంలో వికారాబాద్ కు చెందిన లక్ష్మి (50) రేకుల రూంలో నివాసం ఉంటుంది. స్థానికంగా రోజు వారి కూలీగా ఓ వైన్స్ లో పని చేస్తుంది. శుక్రవారం తెలివరూజమున రేకుల రూంలో నుండి పొగలు రావడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకొని మేడ్చల్ పోలీసులకు సగం కాలిన మృతదేహ లభించింది. గుర్తుతెలియని దుండగులు అతికిరాతకంగా మహిళ గొంతు చెవులను కోసి చంపి మృతదేన్ని కాల్చినట్లు తెలుస్తోంది. ఘటన స్థలానికి క్లూస్ టీం చేరుకొని ఆధారాలను సేకరిస్తున్నారు మేడ్చల్ ఏసిపి శంకర్ రెడ్డి, సి ఐ సత్యనారాయణ హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.
Tags:
Latest News
16 May 2025 18:32:56
బర్త్.. డెత్.. క్యాస్ట్ ఏ సర్టిఫికెట్ కావాలన్న క్షణాల్లో అందిస్తూ సొమ్ము చేసుకుంటున్న ఓ ముఠాకు సరూర్ నగర్ ఎస్ఓటి పోలీసులు చెక్ పెట్టారు. ఈ ముఠా...