కలిసి పనిచేయండి..ఫలితాలు సాధించండి. డైరెక్టర్ షానవాజ్ ఖాసీం
డ్రగ్ కంట్రోల్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలు కలిసి పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయని, సమాచారాన్ని సమన్వయంతో పంచు కుంటే ఉహించిని రీతిలో ప్రగతి కనబడుతుందని డ్రగ్ కంట్రోల్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ ఫోర్స్మెంట్ షానవాజ్ ఖాసీం అన్నారు. ఎక్సైజ్, డ్రగ్స్ కంట్రోల్ అధికారుల సమన్వయ సమావేశం అబ్కారీ భవన్‌లో శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో రెండు శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రాణహాని, మత్తు కలిగించే నిషేది మందుల వినియోగం, డ్రగ్స్, గంజాయి, ఇతర రకాల మాదకద్రవ్యాల వినియోగంతో యువత ఎంతో నష్టపోతున్నారని ఈ విషయంలో ఏ శాఖ పనులు వారు చేస్తూ కొన్ని సందర్భాలలో రెండు శాఖలు కలిసి యువతను మత్తులోకి దింపుతున్న వాటిపై ప్రత్యేక దాడులు నిర్వహించి సమాచారాన్ని పంచుకుంటే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రధానంగా రెండు శాఖలు కలిసి పని చేయడానికి ఉన్నఅవకాశాలు ఏమిటి అనే అంశంపై చర్చించు కోవాలని, కలిసి దాడులు చేయడానికి ప్రాంతాలను గుర్తించి ముందుకు సాగాలన్నారు.
రెండు విభాగాల్లో సమాచార వ్యవస్థను వృద్ది చేసుకోవడానికి నలుగురితో కూడిన కామన్ ఇంటిలీజెన్స్ టీమ్‌ను ఏర్పాటు చేసకోవాలని, ఇండస్ట్రీయల్, ఫోరెన్సిక్ ల్యాబ్‌లు, జాయింట్ ట్రైనింగ్, రైడ్స్, వాట్సాప్ గ్రూప్, ఇంటర్‌నెట్‌లో జరుగు తున్న డ్రగ్స్ వ్యాపారాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యాచరణకు ఒక రూట్‌మ్యాప్‌ను బుక్ లెట్ రూపంలో తీసుకురావాలన్నారు.
ఈ సమన్వయ సమావేశంలో ఎక్సైజ్ శాఖ జాయింట్ డైరెక్టర్ సయ్యద్ యాసిన్ ఖురేషి, డ్రగ్ కంట్రోల్ జాయింట్ డైరెక్టర్ రామ్‌ధాన్, డిప్యూటి కమిషనర్లు కేఏబీ శాస్త్రీ, పి.దశరథ్, అడిషనల్ ఎప్పీ భాస్కర్, అసిసెంట్ డైరెక్టర్ డి.సరిత, అసిస్టెంట్ కమిషనర్ ప్రణవీ, ఎస్టిఎఫ్ టీమ్ లీడర్లు అంజి రెడ్డి, ప్రదీప్‌రావు, తుల శ్రీనివాసరావు, తిరుపతి యాదవ్, డ్రగ్‌ఇన్‌స్పెక్టర్లు లక్ష్మీనారాయణ, చైతన్య, గోవింద్ సింగ్, అనిల్‌రెడ్డిలు పాల్గొన్నారు.