గుట్టలు గుట్టలుగా మందులు.. సీజ్ చేసిన డిసిఏ అధికారులు
తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలంలోని ఐడీఏ నాచారంలో ఓ గోదాంపై దాడి చేశారు. ఈ గోదాంలో బల్క్ గా విక్రయించేందుకు నిల్వ చేసిన మందులను స్వాధీనం చేసుకున్నారు. ఈ గోదాం ఇండియన్ డ్రగ్స్ అండ్ కెమికల్ కి చెందినదిగా గుర్తించారు.శామీర్పేటకు చెందిన డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ఈ దాడి చేసి అక్రమ గోదాంను సీజ్ చేశారు. గోదాంలో నిల్వ చేసిన మందులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మందులన్నీ అనధికారికంగా తయారు చేసి గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అనుమతి లేకుండా తయారు చేసిన నిందితులకు ఐదు సంవత్సరాల జైల్ శిక్ష పడుతుందని డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం హెచ్చరించారు. ఎవరికైనా ఇలాంటి గోదాంలు ఉంటే తమకు సమాచారం అందించాలని కోరారు. ఈ దాడిని శామీర్‌పేట్ అసిస్టెంట్ డైరెక్టర్ అంజుం ఆబిదా, హబ్సిగూడా డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ జి. ఇంద్ర ప్రియదర్శిని, ఉప్పల్ డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ డాక్టర్ బి. లక్ష్మి నారాయణ, శామీర్‌పేట్ డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ బి. ప్రవీణ్, మెడిపల్లీ డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ పి. అంబేద్కర్ లు నిర్వహించారు.