పోలీసులను మిత్రులుగా భావించే స్థాయిలో పని చేయాలి. డీజీపీ జితేందర్

By Ravi
On
పోలీసులను మిత్రులుగా భావించే స్థాయిలో పని చేయాలి. డీజీపీ జితేందర్

 అమెరికాతో పాటు మరి  కొన్ని దేశాల్లోని ప్రజలు పోలీసులను మిత్రులుగా భావిస్తారని ఆ స్థాయిలో ప్రజలకు న్యాయం చేసి వారి అభిమానం పొందాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ల(ఎస్ హెచ్ ఓ ల)కు సూచించారు. డిజిపి కార్యాలయంలో శనివారం నాడు రాష్ట్రంలోని అన్ని యూనిట్లు నుంచి వచ్చిన కొంతమంది ఎస్హెచ్ఓ లతో  డిజిపి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డిజిపి ల్ జితేందర్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లకు ప్రజలు వచ్చినప్పుడు వారికి న్యాయం జరిగేలా చూడాలని తద్వారా వారికి మిత్రులుగా మారాలని సూచించారు. అమెరికాIMG-20250503-WA0076తో పాటు ఇతర కొన్ని దేశాల్లోనీ ప్రజలు పోలీసులను మిత్రులుగా పరిగణిస్తారన్నారు. అమెరికాలో ఉన్న తన స్నేహితుడు ఒకరు తనతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన పిల్లలను నియంత్రిస్తూ తాను ఇండియాలో ఉన్న పోలీస్ అంకుల్ తో మాట్లాడుతున్నానని భయపెట్టే ప్రయత్నం చేశాడు అన్నారు. కానీ అమెరికాలో  పెరుగుతున్న ఆయన పిల్ల వాడు  పోలీస్ అంటే తన మిత్రుడు అని తనకు భయమేమీ లేదని అనడంతో అక్కడ పరిస్థితి ఆసక్తి కలిగించిందన్నారు.  అమెరికాలోని ప్రజలు పోలీసులను మిత్రులుగా భావిస్తారని తెలిసిందన్నారు. ప్రజలకు న్యాయం చేసినప్పుడు పోలీస్ అధికారులు మంచి పేరు తెచ్చుకోవడం తోపాటు ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని అది సర్వీస్ లో ఎప్పటికీ గుర్తుంటుందని అభిప్రాయపడ్డారు. ఏదో  కారణంతో, పోలీస్ అధికారులు పక్షపాతంతో వ్యవహరిస్తే చెడ్డ పేరు కూడా వస్తుందని, తమకు న్యాయం చేయలేదని ప్రజలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారన్నారు. అదేవిధంగా,  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలకు స్టేషన్ హౌస్ ఆఫీసర్లు తమ తమ ప్రాంతాలలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీసులు తమ శక్తి సామర్థ్యాలను చాటుకునే అవకాశం అని, తదనుగుణంగా పోలీసు అధికారులు కృషి చేయాలన్నారు. పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావడంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ల పాత్ర కీలకమని అభిప్రాయపడ్డారు. దేశంలోనే ఉత్తమ పోలీస్ శాఖ గా ఎంపికైన రాష్ట్రంలో పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది ఆ స్థాయిని నిలుపుకునేలా ప్రజలతో వ్యవహరించాలని సూచించారు. సాధించింది కొంత మాత్రమేనని కృషి చేయాల్సింది ఎంతో ఉందని గుర్తుపెట్టుకోవాలని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ర్యాంకు లో  కింది స్థాయికి పడిపోతామని వివరించారు. నిర్లక్ష్యం తో పాటు తప్పులు చేస్తే ఎంతోమందికి సంజాయిషీ ఇవ్వాల్సి వస్తుందని ఆ పరిస్థితి తెచ్చుకోరాదని హితవు చెప్పారు. ప్రస్తుతం యువత కొందరు విదేశాలలో పోలీసు వ్యవస్థలు బాగుంటాయని చెప్తుంటారని ఇక్కడ ఈ వ్యవస్థ చెడిపోకూడదని అంటుంటారని అది గమనించి ప్రజలకు న్యాయం చేసేందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలన్నారు. శాంతి భద్రతల అడిషనల్ డిజిపి  మహేష్ ఎం భగవత్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీల కార్యక్రమాలకు భద్రత కల్పించడం ప్రధానమని అన్నారు. కొన్ని మహిళా సంస్థలు ఈ పోటీలను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటనలు ఇస్తున్నాయని వాటిని గమనించి కంటెస్టెంట్లకు భద్రత కల్పించాలని సూచించారు. అదేవిధంగా, మరొక మాసంలో వ్యవసాయ పనులు ప్రారంభం కానుండడంతో నకిలీ విత్తనాలు, పురుగు మందులు పుట్టుకొస్తాయని అప్రమత్తతో ఉండాలన్నారు. శాంతి భద్రతల ఏఐజి శ్రీ రమణ కుమార్ , డిఎస్పి సత్యనారాయణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News