చిలుకూరు అర్చకుడు రంగరాజన్ పై దాడి చేసిన రాఘవరెడ్డిపై దాడి.. తీవ్రగాయాలు
By Ravi
On
మొయినాబాద్ పిఎస్ పరిధిలో వీర రాఘవరెడ్డిపై దాడి జరిగింది. గుర్తుతెలియని 20 మంది ఆయనను విచక్షణ రహితంగా కొట్టారు. ఇటీవల చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి చేసి జైలుకి వెళ్లాడు. కండిషన్ బెయిల్ పై బయటకు వచ్చిన ఆయన మొయినాబాద్ పిఎస్ లో సంతకం చేసి తిరిగి ఇంటికి వెళ్తూ ఓ టీ స్టాల్ వద్ద ఆగడు. అక్కడే ఉన్న 20 మంది ఆయనపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన వీర రాఘవరెడ్డి వెంటనే పిఎస్ కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. బాధితుడిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. రంగరాజన్ పై దాడి చేయడంతో తట్టుకోలేని జనం దాడి చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Tags:
Latest News
02 May 2025 22:04:48
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 నియామక ప్రక్రియపై నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ నియామకాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఏప్రిల్ 17న హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం...