ఆడపిల్ల పుట్టిందని కత్తితో పసికందును గొంతుకోసిన తండ్రి

By Ravi
On
ఆడపిల్ల పుట్టిందని కత్తితో పసికందును గొంతుకోసిన తండ్రి

ఆడపిల్ల పుట్టిందని కసాయిగా మరీనా ఓ తండ్రి చిన్నారి గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.  నేపాల్‌ నుండి వచ్చి ఒక అపార్టుమెంటులో వాచ్ మెన్‌గా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్న జగత్ విశ్వకర్మ, గౌరీ  దంపతులు. వీరికి ఒక కొడుకు, కూతురు ఉండగా, అనారోగ్యంతో కొడుకు మృతి చెందాడు. 14 రోజుల క్రితం గౌరీకి ఆడపిల్ల జన్మించగా, ఆడపిల్ల పుట్టిందనే కోపంతో తల్లి పొత్తిళ్ళలో నిద్రిస్తున్న పసికందును బయటకు తీసుకువెళ్లి కత్తితో గొంతుకోసి మృతదేహాన్ని గోనె సంచిలో చుట్టి చెత్తకుప్పలో పడేశాడు. ఒక గంట తరువాత నిద్ర లేచిన గౌరి పాప ఎక్కడని నిలదీయగా, చంపేసి గోనె సంచిలో పెట్టానని జగత్ చెప్పడంతో గౌరీ సమీపంలో ఉన్న పరిచయస్తుల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Tags:

Advertisement

Latest News

కలిసి పనిచేయండి..ఫలితాలు సాధించండి. డైరెక్టర్ షానవాజ్ ఖాసీం కలిసి పనిచేయండి..ఫలితాలు సాధించండి. డైరెక్టర్ షానవాజ్ ఖాసీం
డ్రగ్‌ కంట్రోల్‌, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖలు కలిసి పని చేస్తే  మంచి ఫలితాలు వస్తాయని, సమాచారాన్ని సమన్వయంతో పంచు కుంటే ఉహించిని రీతిలో ప్రగతి కనబడుతుందని...
గుట్టలు గుట్టలుగా మందులు.. సీజ్ చేసిన డిసిఏ అధికారులు
ట్రాఫిక్ జామ్ లో ఆగిన అంబులెన్స్ లు .. జాతీయ రహదారిపై హల్చల్ చేసిన వ్యక్తులు
ఇన్ స్టాలో పరిచయం.. ప్రేమ పేరుతో అక్కచెల్లెళ్ల ట్రాప్..
ప్రపంచస్థాయిలో అరుదైన అవార్డ్ కైవసం చేసుకున్న హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్
మేడ్చల్ లో మహిళ దారుణ హత్య
టర్కీతో ఒప్పందం రద్దు చేసుకున్న యూనివర్సిటీ