ఉప్పల్- ఘట్కేసర్ ఫ్లై ఓవర్ పనులు పూర్తి చేయాలి.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలు

By Ravi
On
ఉప్పల్- ఘట్కేసర్ ఫ్లై ఓవర్ పనులు పూర్తి చేయాలి.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలు

ఉప్పల్ నుంచి ఘట్ కేసర్ వైపు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన భూ సేకరణ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలపై అధికారులను కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి ఆరా తీశారు. ప్రజల ప్రయాణ సౌలభ్యం కోసం ప్రాధాన్యతతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉప్పల్-ఘట్ కేసర్ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం భూమి సేకరణలో ఆలస్యం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీరియస్ లక్షలాది ప్రయాణికుల రాకపోకలకు ఉపయోగపడే ఉప్పల్ నుంచి ఘట్ కేసర్ వైపు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ కోసం భూమి సేకరణ ప్రక్రియలో జాప్యం అవుతున్న విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. ప్రాజెక్టు వేగవంతంగా పూర్తయ్యేలా వెంటనే భూమి సేకరణ పూర్తిచేయాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సుమారు రూ. 400 కోట్ల వ్యయంతో నిర్మితమైన అంబర్‌పేట ఫ్లైఓవర్‌ను మే 5న కేంద్ర రోడ్లు మరియు రవాణా శాఖ మంత్రి  నితిన్ గడ్కరీ  అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఫ్లైఓవర్ కింద రోడ్డుపై ప్రజలకు అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి ఆదేశించారు.IMG-20250502-WA0090

Tags:

Advertisement

Latest News

తెలంగాణలో గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు మధ్యంతర స్టే పొడిగింపు తెలంగాణలో గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు మధ్యంతర స్టే పొడిగింపు
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 నియామక ప్రక్రియపై నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ నియామకాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఏప్రిల్ 17న హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం...
పాఠశాల గదుల నిర్మాణాలకు అడ్డువస్తే సహించేది లేదు. ఆకుల సతీష్
మిస్ వరల్డ్ పోటీలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.. డీజీపీ జితేందర్
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్ సీనియర్ అసిస్టెంట్
ట్రంప్‌ చర్చలపై చైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
పాకిస్తాన్‌ పై ఆర్థిక దాడులకు ప్లాన్ చేస్తున్న భారత్..
వేలాది మదర్సాలను మూసేస్తున్న పాకిస్తాన్..