మంత్రాల చెరువు సందర్శించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
By Ravi
On
మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంత్రాల చెరువును ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. చెరువు చుట్టూ సుమారు రెండున్నర కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించి అక్కడి సమస్యలను పరిశీలించారు. ఫెన్సింగ్ ధ్వంసమైనట్లు, వీధిదీపాలు పనిచేయకపోతున్నట్లు, చెరువులో గుర్రపుడెక్క పేరుకుపోయినట్లు గుర్తించారు.
చెరువు కొంత భాగం ఎండిపోవడంతో పూడికతీత పనులు అత్యవసరంగా చేపట్టాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. పై సమస్యలన్నింటినీ 15 రోజుల్లోపూ పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్‌తో పాటు సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. ఈ సందర్శనలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారి జ్ఞానేశ్వర్, డీ.ఈ, పలువురు ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.
Related Posts
Latest News
03 May 2025 21:45:44
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గేట్ వద్ద భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కల్వకుర్తి ఆర్టీసీ బస్ , ట్రావెల్స్ బస్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ...