గంజాయి ఇంట్లో పెట్టడానికి నిరాకరించాడని దాడి
By Ravi
On
గంజాయి ఇంట్లో పెట్టడానికి నిరాకరించినందుకు యువకుడిపై దాడి చేసిన సంఘటన అత్తాపూర్, సులేమాన్‌నగర్లో చోటుచేసుకుంది. గంజాయిని తమ ఇంట్లో పెట్టుకోవడానికి నిరాకరించినందుకు అజ్జు అనే వ్యక్తి సయ్యద్ రిజ్వాన్ అనే యువకుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ దాడిలో యువకుడి తలకు బలమైన గాయం కావడంతో అతడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ ఘటన సులేమాన్‌నగర్ వాసులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. స్థానికంగా యువత గంజాయి మత్తులో పడి చెడు మార్గంలో పయనిస్తున్నారని, వారిని ఈ వ్యసనం నుండి కాపాడాలని పోలీసులను వేడుకుంటున్నారు. ఈ దాడిపై అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
Tags:
Latest News
16 May 2025 17:59:02
బాలపూర్ పిఎస్ పరిధిలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. గత రెండురోజులుగా పరారీలో ఉన్న జనియాను హత్య చేసిన భర్త జకీర్ అహమ్మద్ ను అదుపులోకి...