సమస్యలకు కేరాఫ్ అడ్రస్..మైలార్ దేవులపల్లి. బిఆర్ఎస్ ఆరోపణ
మైలార్ దేవ్ పల్లి డివిజన్ లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి బీఆర్ ఎస్ పార్టీ తరపున పని చేయడం జరుగుతుందని డివిజన్ పార్టీ అధ్యక్షులు ఎస్.వెంకటేష్ అన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ పి. కార్తిక్ రెడ్డి ఆదేశాల మేరకు డివిజన్ అధ్యక్షులు ఎస్.వెంకటేష్ అధ్యక్షతన శుభోదయం మైలార్ దేవ్ పల్లి కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా మెయిన్ విలేజ్ లో పర్యటించారు. ఉమ్మడి హనుమాన్ దేవాలయం వీధిలో ఎక్కడ చూసినా సివరేజ్ మ్యానుహోల్ పొంగి మురికి నీరు రోడ్లపై ఏరులై పారుతుందని, జలమండలి అధికారులు చూసిచూడనట్టు గాలికి వదిలేశారన్నారు. కనీసం ఎండలు మండిపోతున్న తరుణంలో గొట్టపు బావులు ఎండిపోయి మంచినీళ్లు రాక అలమటిస్తున్న ప్రజలకు కనీసం ట్యాంకర్ల ద్వారా మంచి నీరు అందించడం లేదన్నారు. మంచినీరు లేదనిఅధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదన్నారు. స్థానికంగా ప్రజా ప్రతినిధులు సైతం సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా పట్టించుకోని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని బిఆర్ఎస్ పార్టీ తరపున కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎన్ రాము యాదవ్, యువత అధ్యక్షులు అక్యం రఘు, మైసిరెడ్డి, రాజేష్ యాదవ్, అరుణ్ ముదిరాజ్, కొంపల్లి జగదీష్, చిరంజీవి, రాజు, ఆప్కో రాజు, భగవాన్ దాస్, రాజు, ప్రవీణ్, వెంకటరమణ, అశోక్ కుమార్, సందీప్, భాస్కర్, సునీల్, సరికొండ దుర్గేష్, భూదేవి, సరిత, అరుణారెడ్డి బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.