అందెగత్తెలతో అదిరిపోయిన పాతబస్తీ..
ముద్దుగుమ్మల వాక్ తో కళకళలాడిన ఓల్డ్ సిటీ
హెరిటేజ్ వాక్ తో కోలాహలంగా మారిన చార్మినార్
అందెగత్తెలు అదిరిపోయే రేంజ్ లో స్వాగతం పలికిన లాడ్ బజార్ వ్యాపారులు
చౌమోహల్లా ప్యాలెస్ లో విందు
మరోసారి రికార్డ్ బద్దలు కొట్టిన హైదరాబాద్ బిర్యానీ
పాతబస్తీలో అందెగత్తెలతో అదిరిపోయింది. ఎప్పుడు కానీ విని ఎరుగని రీతిలో చార్మినార్ ముస్తాబైంది. మిస్ వరల్డ్ హీరోయిన్ వాక్ తో ఆ ప్రాంతం కోలాహలంగా మారింది. ప్రభుత్వం చేసిన ఏర్పాట్లతో చార్మినార్ అందం మరింత పెరిగింది. ఒక్కసారిగా ముద్దుగుమ్మలు పాతబస్తీలో ఎర్ర తివాచీపై వాక్ చేస్తూ ఉంటే మదీనా టు గుల్జార్ హౌస్ చార్మినార్, లాడ్ బజార్ కలకళలాడిపోయాయి. రోడ్లు, షాపులు, బస్తీలు ముచ్చటగా తయారయ్యాయి. హైదరాబాద్ అందాలను అన్నిటినీ కట్టిపడేసే ఒక చోట చేరిస్తే ఎలా ఉంటుందో అచ్చం హెరిటేజ్ వాక్ ముద్దుగుమ్మలతో ముచ్చటగా మారింది. జనం ఈ వాక్ తిలకించేందుకు వచ్చిన ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ సీపీ సి.వి. ఆనంద్ నేతృత్వంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేసి కట్టుదిట్టం చేశారు. అడుగడుగునా సిసి కెమెరాల పర్యవేక్షణతో సిపి స్వయంగా ఏర్పాట్లను పరిశీలించారు. 109 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ కంటెస్టులు పాతబస్తీ వీధుల్లో వాక్ చేస్తూ ఉంటే చూడటానికి రెండు కళ్లు చాలవు అన్నట్లుగా వాతావరణం సందడిగా మారింది. పర్యాటక శాఖ, సాంస్కృతిక శాఖ చేసిన ఏర్పాట్లు ఎంత వర్ణించిన తక్కువే.
లాడ్ బజార్ వ్యాపారుల రూటే సపరేటు..
ప్రపంచ సుందరాంగులను లాడ్ బజార్ వ్యాపారులు ఘనంగా స్వాగతించారు. షాపుల వద్ద గులాబీ వర్షం కురిపించి తమ షాపులోని వస్తువులను ఉచితంగా అందించారు. పాతబస్తీ చరిత్ర, ఇక్కడి ప్రత్యేకత ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా చూడాలని అదే తమకు ఇచ్చే గుర్తింపు అని కోరారు. అందెగత్తెల షాపింగ్ తో లాడ్ బజార్ మురిసిపోయింది.
చౌమోహల్లా ప్యాలెస్ లో విందు....
చార్మినార్ వద్ద నుండి హెరిటేజ్ వాక్ చేస్తూ మిస్ వరల్డ్ కంటెస్టులు చౌమోహల్లా ప్యాలెస్ కు చేరుకున్నారు. అక్కడే ప్రభుత్వం అన్ని దేశాల రుచులతో ఘనంగా విందు ఏర్పాటు చేసింది. వివిధ దేశాలకు చెందిన రుచులతో ఆ ప్రాంతం గుమ గుమ లాడింది. అన్ని వంటకాల కన్నా హైదరాబాద్ బిర్యానీ స్పెషల్ స్టాల్ అదిరిపోయే రేంజ్ లో మరోసారి రికార్డ్ బద్దలు కొట్టింది. అందెగత్తెలు అందరూ హైదరాబాద్ బిర్యానీ రుచి చూసి అదిరిపోయే రేంజ్ లో కితాబు ఇచ్చారు. దీనితో అధికారులు ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయారు. ఏదిఏమైనా ప్రపంచ సుందరీమణులంతా పాతబస్తీలో వాక్ చేయడం చరిత్రలో అదిరిపోయే అంశం.