ఎక్సైజ్ శాఖకే వన్నె తెచ్చిన వ్యక్తి కమలాసన్ రెడ్డి.. కమిషనర్ హరికిరణ్
ఎక్సైజ్ శాఖలో కమలాసన్ రెడ్డి దగ్గర పని చేయడం ఎంతో గర్వాంగా ఉందని కమిషనర్ సి హరికిరణ్ అన్నారు. చాలామంది పోలీస్ ఆఫీసర్లతో పని చేసే అవకాశం వచ్చింది కానీ కమలాసన్ రెడ్డి లాంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ తో కలిసి పనిచేయడం తనకు చాలా ఆనందంగా ఉందని, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పరువు ప్రతిష్టలను ఆయన పెంచడంలో ఎంతో కృషి చేశారని అన్నారు. ఎక్సైజ్ శాఖ నుంచి శాఖ నుంచి మరో శాఖకు బదిలీ కావడం ఈ సందర్భంగా గోల్కొండ హోటల్లో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కమలాసన్ రెడ్డితో కలిసి ఆరు నెలలు పని చేసే అవకాశం దొరికిందని ఆయన పనితీరు చాలా సంతృప్తినిచ్చిందని, శాఖకు మంచి గుర్తింపు తెచ్చారని ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. పనిచేసే వాళ్లకు ఎక్కడైనా గుర్తింపు ఉంటుందని, పనిచేసే అవకాశాలు లభిస్తాయని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి.బి. కమలాసన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయనను సిబ్బంది ఘనంగా సన్మానించారు. వేదికపై డ్రగ్ కంట్రోల్ అథారిటీ రాందేవ్, ఎక్సైజ్ అండ్ ఫోర్స్ మెంట్ జాయింట్ కమిషనర్ కే ఏ. బి. శాస్త్రితో పాటు ఇతర వ్యక్తులు హాజరయ్యారు.