నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్
By Ravi
On
మెహదీపట్నం పిఎస్ పరిధిలో సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. టోలిచౌకి ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా నకిలీ యూనివర్సిటీ సర్టికెట్లు తయారు చేస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ముజీబ్ హుస్సేన్, నాసిర్ ఖాన్, బసీర్ రహమాని, రహమాన్ సిద్దిఖీలను అదుపులోకి తీసుకొని వారి నుండి పలు యూనివర్సిటీలకు చెంసిన 108 సర్టిఫికెట్లు, 4మొబైల్స్ ఫోన్స్, రబ్బర్ స్టాంప్స్ స్వాదీనం చేసుకున్నారు. ఈ ముఠా ఎడ్యుకేషన్ కన్సల్టెంటెన్సీ పేరుతో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేసే యువతకు నకిలీ సర్టిఫికెట్లు అందించి సొమ్ము చేసుకుంటున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ ముఠాపై కేసు నమోదు చేసిన పోలీసులు వీరి నుండి ఫేక్ సర్టిఫికెట్లు పొందిన వారి వివరాలు సేకరిస్తున్నారు.
Tags:
Latest News
13 May 2025 22:41:02
ముద్దుగుమ్మల వాక్ తో కళకళలాడిన ఓల్డ్ సిటీహెరిటేజ్ వాక్ తో కోలాహలంగా మారిన చార్మినార్అందెగత్తెలు అదిరిపోయే రేంజ్ లో స్వాగతం పలికిన లాడ్ బజార్ వ్యాపారులుచౌమోహల్లా ప్యాలెస్...