దేవుడా వీటిని కూడా నకిలీ చేశారా

By Ravi
On
దేవుడా వీటిని కూడా నకిలీ చేశారా

మార్కెట్లో ఫేక్.. ఫెవిక్విక్‌లు వచ్చాయి. దుండగులు చివరకు 5 రూపాయలకు 10 రూపాయలకు దొరికే వస్తువులు కూడా నకిలీవి తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఇది ఎక్కడో కాదు తాండూరులో వ్యాపారుల దందాలో బయటపడింది. దాడులు నిర్వహించిన పోలీసులు నకిలీ ఫెవి క్విక్ లను స్వాదీనం చేసుకున్నట్లు సమాచారం. 
 వివిధ వస్తువులను అతికించేందుకు వినియోగించే ఫెవిక్విక్‌లను ఫేక్‌ చేసినట్లు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తాండూరులోని పోలీసులు ఆయా కంపెనీ ప్రతినిధులతో జరిపిన దాడులే ఇందుకు కారణం. గురువారం సాయంత్రం వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణంలో జరిగిన దాడులు చర్చనీయాంశంగా మారాయి. స్థానిక పోలీసులు, కంపెనీల ప్రతినిధులు సంయుక్తంగా పట్టణంలోని గాంధీ చౌక్ సమీపంలో ఉన్న ఓ దుకాణంలో దాడులు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ దాడులలో పోలీసులు, కంపెనీ ప్రతినిధులు ఫెవిక్విక్ కంపెనీలకు చెందిన వస్తువులను పెద్ద ఎత్తున సీజ్ చేసినట్లు తెలిసింది. సాయంత్రం అధికారులు దాడులు చేసి.. రాత్రి వరకు విచారణ చేపట్టారు. కాని సమగ్ర విచారణ తరువాత వివరాలు వెల్లడిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. మరోవైపు ఈ దాడులతో తాండూరులో డూప్లీకేట్ దందాలు చేసే వ్యాపారులు ఉలిక్కి పడ్డారు. అధికారులు కేవలం ఫెవిక్విక్ వస్తువులో కాకుండా డూప్లీకేట్ ఫ్యారాచూట్ డబ్బాలు, సబ్బులు, ఇతర వస్తువులను కూడా స్వాదీనం చేసుకున్నట్లు ప్రచారం జరిగింది.IMG-20250501-WA0081

Tags:

Advertisement

Latest News

మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ కి హైకోర్టులో చుక్కెదురు మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ కి హైకోర్టులో చుక్కెదురు
బీజేపీ నాయకుడు, మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన ఒక క్రిమినల్ కేసును రద్దు చేయాలని కోరుతూ ఆయన...
దేవుడా వీటిని కూడా నకిలీ చేశారా
మెట్రోలో సాంకేతిక లోపం.. అవస్థలు పడ్డ ప్రయాణికులు
ఎస్సీ వర్గీకరణ అనంతరం జాబ్ క్యాలెండర్ వేగం పెంపు
టీజీబీసీఎల్‌ కొత్త జీఎం గుండమనేని శ్రీనివాస్‌రావు బాధ్యతల స్వీకరణ
ఆటల్లో.. చదువుల్లో టాపర్ గా నిలిచిన ఓల్డ్ సిటీ స్టూడెంట్ హేమలత
ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన షానవాజ్ ఖాసీం